మెగాస్టార్ చిరంజీవి అంటేనే ఒక బ్రాండ్ నేమ్ ఉన్న హీరో. మెగా హీరోల సినిమాలు ఎప్పుడైనా సరే మొదటి రోజు టాక్ తో సంబంధం లేకుండా రికార్డులు కొల్లగొట్టడం మనం చూశాం. కానీ ఆచార్య మూవీ మాత్రం మొదటిరోజు కేవలం 70 % ఆక్యుపెన్సీ తో రావడం గమనార్హం.
Advertisement
Advertisement
ఆచార్య సినిమా చూసినటువంటి ప్రేక్షకులు ఈ మూవీలో కథనం మరియు కథ ప్రేక్షకులను మెప్పించే స్థాయిలో లేదని సోషల్ మీడియా వేదికగా అనేక కామెంట్లు వస్తూ ఉన్నాయి. ఈ విధంగా వైరల్ అయిన కథనంలో హీరో చిరంజీవి దేవాలయ శాఖ అధికారిగా నటిస్తారని వార్తలు కూడా వచ్చాయి. అలాగే దేవాలయాలకు సంబంధించి భూముల విషయంలో జరుగుతున్నటువంటి మోసాలను చిరంజీవి చెక్ పెట్టడంతో పాటుగా, దేవుని భూములను కౌలుకు తీసుకొని తక్కువ డబ్బులు చెల్లించే వారికి బుద్ధి చెబుతారని కథాంశం మీద ఆచార్య మూవీ వస్తోంది అని వార్తలు కూడా వచ్చాయి. అయితే ఆచార్య మూవీ కి మరియు వైరల్ అయిన కథకు ఎలాంటి పోలికలు సరితూగ లేదని చాలా మంది నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. అయితే ఆచార్య ఫుల్ రన్ లో ఏ విధంగా కలెక్షన్లను సాధిస్తుందో చూడాల్సి ఉన్నది. ఆచార్య మూవీ డిస్ట్రిబ్యూటర్ లను రామ్ చరణ్ మరియు చిరంజీవి ఆదుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.. ఈ మూవీ కి వచ్చిన భారీ నష్టాల వల్ల డిస్ట్రిబ్యూటర్లు చాలా ఇబ్బందులు పడ్డారని, అలాగే మూవీ రిజల్ట్ కొరటాల శివ పై ఎఫెక్ట్ చూపుతోందని తెలుస్తోంది. అయితే కొరటాల శివ మరో సినిమాతో భారీ సక్సెస్ లు సొంతం చేసుకుంటే బాగుంటుందని అంటున్నారు. అయితే సినిమా ప్లాప్ అయినా సరే కొరటాల శివ తోనే ఎన్టీఆర్ సినిమా చేస్తున్నారని తెలుస్తోంది. అయితే ఈ మూవీలో ఎన్టీఆర్ స్టూడెంట్ పాత్రలో కనిపిస్తారని తెలుస్తోంది.
ALSO READ :
అన్నగారు నాకో ఛాన్స్ ఇవ్వండని అడిగిన కైకాల..ఎన్టీఆర్ ఏం చేశారో తెలుసా…!
చిరుతో పూరీ సినిమా ఎందుకు ఆగిపోయిందో తెలుసా..?