Home » జపాన్లో “ఆరెంజ్” రీ రిలీజ్… అక్కడ రామ్ చరణ్ కు మామూలు క్రేజీ లేదుగా..!

జపాన్లో “ఆరెంజ్” రీ రిలీజ్… అక్కడ రామ్ చరణ్ కు మామూలు క్రేజీ లేదుగా..!

by AJAY
Ad

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చిరుత మూవీతో వెండితెరకు పరిచయం అయిన చరణ్ ఇప్పటివరకు తన కెరియర్లో ఎన్నో బ్లాక్ బాస్టర్ మూవీలలో హీరోగా నటించి అద్భుతమైన క్రేజీను ఎంతో మంది అభిమానుల అభిమానాన్ని సంపాదించుకున్నాడు.

Advertisement

పోయిన సంవత్సరం చరణ్ పాన్ ఇండియా మూవీ “ఆర్ఆర్ఆర్” లో నటించి భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడం మాత్రమే కాకుండా గ్లోబల్గా క్రేజీ ను కూడా పెంచుకున్నాడు. ఇది ఇలా ఉంటే చరణ్ గతంలో ఆరెంజ్ అనే బ్యూటిఫుల్ లవ్ స్టోరీ మూవీలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. మగధీర మూవీ తర్వాత చరణ్ నటించిన సినిమా కావడంతో ఈ మూవీపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

Advertisement

అలా భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా థియేటర్లలో ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేక పోయింది. కానీ ఆ తర్వాత ఈ సినిమా బుల్లితెరపై మాత్రం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమాకు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించగా జెనీలియా ఈ మూవీలో హీరోయిన్గా నటించింది. కొణిదల నాగబాబు ఈ మూవీని నిర్మించాడు.

ఇది ఇలా ఉంటే ఈ సంవత్సరం చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీని మళ్లీ థియేటర్లలో రీ రిలీజ్ చేసిన విషయం మనకు తెలిసింది. ఈ మూవీ రీ రిలీజ్ లో భాగంగా అదిరిపోయే రేంజ్ కలెక్షన్లను వసూలు చేసింది. తాజాగా “ఆర్ఆర్ఆర్” మూవీతో రామ్ చరణ్ కు జపాన్లో అదిరిపోయే క్రేజ్ లభించిన విషయం కూడా మనకు తెలిసింది. దానితో ఆరెంజ్ మూవీని జపాన్లో కూడా విడుదల చేశారు. తాజాగా ఆరెంజ్ మూవీ ప్రదర్శిస్తున్న థియేటర్ లో రామ్ చరణ్ ఫ్యాన్స్ “We Love Charan” అంటూ తమ అభిమానాన్ని తెలియజేస్తుంటే నాగబాబు దానిని వీడియో తీసి ఇండియన్ ఆడియన్స్ తో పంచుకున్నాడు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతుంది.

Visitors Are Also Reading