Home » “ఆరెంజ్” సినిమా హీరోయిన్ రూబ గుర్తుందా..? ఇప్పుడు ఎలా ఉందో ఏం చేస్తుందో తెలుసా..?

“ఆరెంజ్” సినిమా హీరోయిన్ రూబ గుర్తుందా..? ఇప్పుడు ఎలా ఉందో ఏం చేస్తుందో తెలుసా..?

by AJAY
Ad

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోగా న‌టించిన ప్రేమ క‌థా చిత్రం ఆరెంజ్ ను రీసెంట్ గా రీరిలీజ్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాను రిలీజ్ చేసిన‌ప్పుడు ఫ్లాప్ టాక్ ను మూట‌గ‌ట్టుకుని న‌ష్టాల‌ను తెచ్చిపెట్టింది కానీ రీరిలీజ్ లో మాత్రం ఈ సినిమాకు వ‌సూళ్ల వ‌ర్షం కురిసింది. ఈ సినిమా గురించి చెప్పాలంటే చాలా ఇంట్రెస్టింగ్ విష‌యాలు ఉన్నాయి. ఈ చిత్రంలో పాట‌లు బ్యాగ్రౌండ్ మ్యూజిక్ హైలెట్ గా నిలిచాయి.

Advertisement

అంతేకాకుండా సినిమాలో లొకేష‌న్స్ మ‌రియు హీరోహీరోయిన్ ల కాస్ట్యూమ్స్ కూడా ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి. అదేవిధంగా ఈ సినిమాలో మ‌రో హైలెట్ రూబ‌. అదేనండీ సినిమాలో రెండో హీరోయిన్. ఈ సినిమాలో ఊహ‌తెలిసిన త‌ర‌వాత రామ్ చ‌ర‌ణ్ మూడు సార్లు ప్రేమ‌లో ప‌డ‌తాడు. కాగా కాలేజీ లైఫ్ లో రూబ అనే అమ్మాయిని చూసి ప్రేమిస్తాడు.

Advertisement

అంతే కాకుండా రూబ కోసం ఏకంగా ముంబై కి వెళ‌తాడు. అక్క‌డ రూబ‌ను క‌లుసుకుంటాడు. సినిమాలో వీరిద్ద‌రి మ‌ధ్య జ‌రిగే స‌న్నివేశాలు ప్రేక్ష‌కుల‌ను ఫిదా చేశాయి. నిజానికి ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ జ‌నీలియా కానీ ఆమె న‌ట‌న ప్రేక్ష‌కుల‌కు విసుగు తెప్పించింది. కారీ రూబ ను చూసిన ప్రేక్ష‌కులు ఫ్లాట్ అయ్యారు. అయితే ఆ త‌ర‌వాత మ‌ళ్లీ రూబ క‌నిపించ‌లేదు.

ఇక రూబ అస‌లు పేరు షాజాన్ ప‌దమ్సీ..ఆరెంజ్ కంటే ముందు ఈ ముద్దుగుమ్మ ఓ బాలీవుడ్ సినిమాలో న‌టించింది. ఆ త‌ర‌వాత త‌మిళ్ లో కూడా ఓ సినిమాలో న‌టించింది. ఇక ఆరెంజ్ త‌ర‌వాత తెలుగులో మ‌ళ్లీ మ‌సాల సినిమాలో హీరోయిన్ గా న‌టించింది. ఈ సినిమా కూడా ఫ్లాప్ అవ్వ‌డంతో అమ్మ‌డికి పెద్ద‌గా అవ‌కాశాలు రాలేదు. ఇక ప్ర‌స్తుతం ఈ ముద్దుగుమ్మ సూప‌ర్ దమాల్ అనే టీవీ షో చేస్తోంది. కాగా ప్ర‌స్తుతం ఈ అమ్మ‌డి ఫోటోలు నెట్టింట వైర‌ల్ అవ్వ‌డంతో ఆరెంజ్ బ్యూటీ ఇంత మారిపోయిందా అని షాక్ అవుతున్నారు.

also read :సిద్ధార్థ్ మొదటి భార్య ఎవరో తెలుసా? విడాకులు ఎందుకు తీసుకున్నారు!

Visitors Are Also Reading