Home » Chiranjeevi: “భోళా శంకర్” చూసాక మెగాస్టార్ కి ఓపెన్ లెటర్ రాసిన అభిమాని.. మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఇదే అంటూ..!

Chiranjeevi: “భోళా శంకర్” చూసాక మెగాస్టార్ కి ఓపెన్ లెటర్ రాసిన అభిమాని.. మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఇదే అంటూ..!

by Srilakshmi Bharathi
Published: Last Updated on
Ad

ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి మెగా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నారు చిరంజీవి. తెలుగు కమర్షియల్ సినిమా గురించి చెప్పాలంటే మొదట వినపడేది చిరంజీవి పేరే. 150 కి పైగా సినిమాల్లో నటించి తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు చిరు. స్టైల్ తో డాన్స్ తో అందరిని ఆకట్టుకున్నారు చిరంజీవి. చిరంజీవిని ఆదర్శంగా తీసుకుని ఇండస్ట్రీకి చాలామంది వచ్చారు. హీరోలు అవ్వాలని చిరంజీవిని ఆదర్శంగా తీసుకుని ఇండస్ట్రీకి ఇప్పుడు చాలా మంది వస్తూనే వున్నారు.

Advertisement

అలాంటి మెగాస్టార్ ఇప్పుడు రీమేక్ సినిమాలనే ఎక్కువగా చేస్తున్నారు. గాడ్ ఫాదర్, భోళా శంకర్ సినిమాలు రీమేక్ లే. ఇది కాకుండా చేయబోయే బ్రో డాడీస్ సినిమా కూడా రీమేక్ నే అవుతుంది. ఈ క్రమంలో ఓ మెగాస్టార్ వీరాభిమాని ఆయనకు లెటర్ రాసారు. ఆ లెటర్లో ఏమి ఉంది ఇప్పుడు చదవండి. ప్రియమైన అన్నయ్యకి మీ శతకోటి అభిమానుల్లో నేను ఒకడిని. ఇలా ఓపెన్ లెటర్ రాయాల్సి వస్తుందని ఎప్పుడు అనుకోలేదు. తనలాంటి డైహార్డ్ అభిమానులు రుద్రవీణలో సూర్యం చిరంజీవిని, గ్యాంగ్‌లీడర్‌లోని రాజారామ్‌ను కోరుకుంటున్నారని మరియు ఖైదీ నంబర్ 150, లూసిఫర్ మొదలైనవాటిని కాదని ఆ లేఖలో పేర్కొన్నారు.

Advertisement

తెలుగువారికి సినిమా పిచ్చి ఉంది. ఇప్పటికే లూసిఫెర్, వేదాళం సినిమాలు చాలా మంది చూసేసారు. ఈ డిజిటల్ యుగంలో రీమేక్ లు చేయడం ఎంతవరకు కరెక్ట్. ఒకసారి చూసేసిన సినిమా పాత్రలనే చిరంజీవి మళ్ళీ ఎందుకు చెయ్యాలి? ఎవరికో ఎప్పుడో ఇచ్చిన మాట కోసం సినిమా అవకాశం ఎందుకు ఇవ్వాలి? మీ భోళాతనం వలన కేవలం ప్రొడ్యూసర్లు మాత్రమే నష్టపోవడం లేదు. ఆర్థికంగా మానసికంగా మీ అభిమానులే నష్టపోతున్నారు.

నేను స్కూల్ లో చెడ్డీలు వేసుకునే వయసు నుంచి నా కొడుక్కి ప్యాంట్లు కొని వేసే వయసు వచ్చే వరకు మీ సినిమాలకు చాలానే ఖర్చు పెట్టాను. కొన్ని వందల వేల గంటలు మీ సినిమాలకి కేటాయించాము. కాబట్టి ఓ తమ్ముడిగా ఇలా అడగవచ్చనే అనుకుంటున్నాను. దయచేసి మీ స్థాయి గుర్తించి సినిమాలు ఎంచుకోండి. కామెడీ చేసే పదిమంది వచ్చి భజన చేస్తే వారికి భోజనం చేసే అవకాశం ఇవ్వండి తప్ప సినిమాల్లో ఆఫర్లు ఇవ్వకండి అంటూ రిక్వెస్ట్ చేసారు. నవతరం రైటర్లకు అవకాశం ఇవ్వండి. టాలెంట్ ని ప్రోత్సహించండి అంటూ కోరాడు. ఈరోజు ఉదయం ఏడు గంటలకల్లా చాలా మంది కుటుంబాలు ఇంట్లో పొయ్యి కూడా వెలిగించకుండా వచ్చేసాయి. మీ స్థాయి అంటే అదే.. ఎంత బాధ పడి ఉంటె ఇంత పెద్ద లేఖ రాస్తానో చెప్పు అన్నయ్యా.. నీ వజ్రాల కిరీటంపై వజ్రాలు ఎత్తుకుపోతుంటే చూస్తూ ఉండలేను. హెచ్చరిక చెయ్యకుండా ఎలా ఉంటాను? ఈ పొగడ్తలు మనకి వద్దు అన్నయ్యా.. నీ దాకా చేరదని తెలుసు.. కానీ చెప్పలేకుండా ఉండలేను.” అంటూ లేఖని ముగించాడు. ఈ లేఖ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.

 

Visitors Are Also Reading