మన ఇళ్లలో సాధారణంగా పిల్లులు, కుక్కలను పెంచుకుంటాం. వాటిని ఇంట్లో మనిషి లాగానే చూసుకుంటాం. వాటికి స్పెషల్ ఫుడ్, బెడ్డు అన్ని అరేంజ్ చేస్తాం. ఎక్కడికి వెళ్లినా గాని మన ఇంటి మనిషి లాగానే తీసుకెళ్తాము. మనం ఏ విధంగా ప్రేమ చూపిస్తామో అదేవిధంగా ఆ జంతువులు కూడా మనపై అంత విశ్వాసాన్ని పెంచుకుంటాయి. ఎక్కడికి వెళితే అక్కడికి మన చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. అయితే ఇలాంటి పెంపుడు జంతువుల అప్పుడప్పుడు ఆటపట్టిస్తూ ఉంటాయి. మన పైకి ఎగరడం, మనం ఫుడ్ పెడితే అటు ఇటు గెంతడం. ఇలా చిలిపి చేష్టలు చేస్తూ నవ్వు తెప్పిస్తాయి.
Advertisement
అయితే అలాంటి ఒక పిల్లి వీడియోనే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దాన్ని చూస్తే మీరు తప్పకుండా ఆపకుండా నవ్వుతారు. వివరాల్లోకి వెళితే ఒక మహిళ ఇంట్లో పిల్లిని పెంచుకుంటోంది. ఎలాగైనా పిల్లిని ఆటపట్టించాలనుకుంది. పాపం ఆ పిల్లి తినడానికి ఏమైనా పెడతారని అనుకొని కిచెన్ కి వెళ్ళింది. అప్పుడే ఆమె ఆనియన్స్ కట్ చేస్తోంది.
Advertisement
మెల్లగా పిల్లిని పైకెత్తి టేబుల్ పైన కూర్చోబెట్టింది.ఇక ఆనియన్స్ కట్ చేయడం మొదలుపెట్టింది. సాధారణంగా ఆనియన్స్ కట్ చేస్తే పక్కన ఉన్నవారికి తప్పకుండా కన్నీళ్లు వస్తాయి. అయితే ఆ మహిళ పిల్లికి కూడా నీళ్లు వస్తాయో లేదో చెక్ చేయాలి అనుకుందో ఏమో.. దాన్ని పక్కన పెట్టుకొని ఉల్లిపాయలను కట్ చేసింది. దీంతో ఆ పిల్లి రియాక్షన్స్ చాలా ఫన్నీగా ఉన్నాయి. తన కళ్ళను మూస్తూ తెరుస్తూ, మూతి అటు ఇటు తిప్పుతూ, ఆ మహిళ వైపు దీనంగా చూస్తూ ఉంది పిల్లి. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.
Who’s cutting onions? 😅#Caturday pic.twitter.com/lGDGZwe3LQ
— Buitengebieden (@buitengebieden) May 28, 2022
also read;
పాత అంబాసిడర్ మళ్లీ రాబోతుందా.. సరికొత్త లుక్ ఓసారి చూసేయండి..!!