Home » హీరోయిన్ కాకముందే చనిపోతా అనుకున్నా.. కానీ రాఘవేంద్రరావు దయతో అంటూ.. షాకింగ్ కామెంట్స్ చేసిన విష్ణు ప్రియ..?

హీరోయిన్ కాకముందే చనిపోతా అనుకున్నా.. కానీ రాఘవేంద్రరావు దయతో అంటూ.. షాకింగ్ కామెంట్స్ చేసిన విష్ణు ప్రియ..?

by Sravanthi Pandrala Pandrala
Ad

బుల్లితెరపై తన అందంతో ఎంతోమంది అభిమానుల గుండెల్లో గూడుకట్టుకున్న యాంకర్ విష్ణు ప్రియ గురించి తెలియని వారుండరు. ఎన్నో కార్యక్రమాల్లో యాంకరింగ్ చేస్తూ స్పెషల్ ఇమేజ్ ను సంపాదించుకుంది. ఎప్పుడు సోషల్ మీడియాలో కూడా హాట్ హాట్ వీడియోలతో యువతను చమటలు పట్టిస్తూ ఉంటారు. ఏదైనా స్పెషల్ ఈవెంట్ లో ఆమె స్టేజి ఎక్కింది అంటే అంతా గందరగోళమే తన మాటలతో ఎంతో మందిని మెస్మరైజ్ చేస్తూ ఉంటుంది. ఈ విధంగా బుల్లితెరపై స్పెషల్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది యాంకర్ విష్ణు ప్రియ. అయితే ఈ అమ్మడు సినిమా అవకాశం కోసం ఎదురుచూస్తూ ఉంది.

Advertisement

ఈ మధ్య కాలంలోనే ఆమె సినిమాలో కూడా ఛాన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఆమె సంచలన కామెంట్స్ చేయడంతో వైరల్ గా మారాయి. పోవే పోరా అనే షో ద్వారా గుర్తింపు తెచ్చుకున్న విష్ణు ప్రియా. దీని తర్వాత చాలా సినిమాల్లో అవకాశాలు అందుకునే ప్రయత్నం మాత్రం చేసింది. అలాగే సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ రోల్స్ పోషిస్తూ అభిమానులతో ఎప్పటికప్పుడు అప్ డేట్ లో ఉంటుంది. అయితే ఈ అమ్మడు” వాంటెడ్ పండుగాడు” అనే మూవీలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు సమర్పణలో వస్తున్న ఈ సినిమాలో సుడిగాలి సుదీర్ మరియు దీపిక పిల్లి జంటగా నటిస్తున్నారు.

Advertisement

శ్రీధర్ సీపాన డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ చాలా వేగంగా జరుగుతోంది. ఒకవైపు షూటింగ్ లో బిజీగా ఉంటూ మరోవైపు ప్రమోషన్స్ కూడా చేపడుతున్నారు. ఈ సందర్భంలోనే తాజాగా జరిగిన ఒక మీడియా సమావేశంలో విష్ణు ప్రియ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. తను హీరోయిన్ అవ్వకుండానే చని పోతానేమోనని భయపడ్డానని, కానీ దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు సినిమాలో ఒక గొప్ప అవకాశం ఇచ్చారని చెబుతూ అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంది విష్ణు ప్రియా. తన గ్లామర్ విషయంలో ఏ మాత్రం తగ్గని విష్ణు ప్రియ ఈ మూవీలో ఎలాంటి రోల్ చేస్తుందో విడుదలైతే కానీ చెప్పలేం. అయితే ఈ సినిమాలో విష్ణు ప్రియ తో పాటుగా అనసూయ, బ్రహ్మానందం, సునీల్, వెన్నెల కిషోర్, సప్తగిరి కీలక పాత్రలో నటిస్తున్నారని తెలుస్తోంది.

also read;

“శంకర్ దాదా ఎంబీబీఎస్” సినిమాలో ఏటీఎమ్ పాత్ర కోసం మొదట ఆ స్టార్ హీరోను అనుకున్నారట..కానీ..!

కిరాక్ RP కాబోయే భార్య ఎవరో తెలుసా.. మీరు ఎప్పుడు చూడని లేటెస్ట్ ఫొటోస్ వైరల్..?

 

Visitors Are Also Reading