Home » మగధీర సినిమాలో చిరంజీవికి డూప్ గా నటించిన కమెడీయన్ ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..!

మగధీర సినిమాలో చిరంజీవికి డూప్ గా నటించిన కమెడీయన్ ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..!

by Anji
Ad

టాలీవుడ్ ఇండస్ట్రీలోని బ్లాక్ బస్టర్ హిట్ లలో మగధీర సినిమా ఒకటి కాగా.. ఈ సినిమా కళ్లు చెదిరే స్థాయిలో కలెక్షన్లను సాధించి నిర్మాతలకు మంచి లాభాలను అందించింది. మగధీర మూవీలో కొన్ని నిమిషాల పాటు చిరంజీవి నటించారనే సంగతి తెలిసిందే.  చిరంజీవి డేట్స్ విషయంలో ఇబ్బందులు ఎదురుకావడంతో కొన్ని షాట్స్ ని ప్రముఖ కమెడీయన్ ప్రభాస్ శ్రీనుతో తీశారు. ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ శ్రీను ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

Advertisement

ప్రతి రోజు టిఫిన్ సెంటర్ కి వెళ్లి ఫ్రెండ్స్ అంతా అన్ లిమిటేడ్ టిఫిన్ తినేవాళ్లమని.. తాను మగధీర మూవీలో చిరంజీవి గారికి డూప్ చేశానని ప్రభాస్ శ్రీను వెల్లడించారు. చిరంజీవికి డూప్ గా చేయడం అంటే పెద్ద అదృష్టం అని  ప్రభాస్ శ్రీను వెల్లడించారు. అప్పట్లో ప్రభాస్ గారింట్లో రాత్రి 3 గంటల వరకు వాలీబాల్ ఆడేవాళ్లమని ప్రభాస్ శ్రీను చెప్పుకొచ్చారు. ఆ సమయంలో రాజమౌళి నుంచి ఫోన్ కాల్ వచ్చి సినిమాలో ఆఫర్ ఇచ్చారని.. వెల్లడించారు ప్రభాస్ శ్రీను. 

Advertisement

ఆ సినిమాలో నా డ్రెస్.. చిరంజీవి వేసుకొన్న డ్రెస్ ఒకటేనని ప్రభాస్ శ్రీను పేర్కొన్నారు. చిరంజీవి వస్తుంటే నేను పారిపోయేవాడినని ప్రభాస్ శ్రీను వెల్లడించారు.  ఆ డ్రెస్ ను అలాగే ఉంచుకోవాలని అనుకున్నానని ఆయన తెలిపారు. ఆ డ్రెస్ దొరకలేని ప్రభాస్ శ్రీను కామెంట్స్ చేశారు. ప్రభాస్ శ్రీను వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతున్నాయి. చిరంజీకి డూప్ గా ప్రభాస్ శ్రీను చేశారని తెలిసి నెటిజన్లు సైతం ఆశ్చర్యానికి గురవుతున్నారు. ప్రభాస్ శ్రీను కమెడీయన్ గా ఇప్పటికీ వరుస ఆఫర్లతో బిజీగా ఉన్నారు. ప్రభాస్ శ్రీను రెమ్యునరేషన్ సైతం భారీ స్థాయిలో ఉందని తెలుస్తోంది.

Also Read :  టాలీవుడ్ స్టార్స్ తో కోడి రామకృష్ణ టాప్ హిట్స్.. ఆ సినిమాలు ఏవో తెలుసా ?

Visitors Are Also Reading