Home » మెగా బ్రదర్స్ గురించి ఈ స్టార్ డైరెక్టర్ ఏమన్నారో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..!

మెగా బ్రదర్స్ గురించి ఈ స్టార్ డైరెక్టర్ ఏమన్నారో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..!

by Anji
Ad

టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అన్నయ్య చిరంజీవి మాదిరిగానే హీరోగా ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ స్టార్ హీరోగా ఎదిగి ఆయన లాగే ఎంతో మందికి ఇన్  స్పైర్ అయ్యాడు.  ప్రస్తుతం ఓ వైపు  రాజకీయాల్లోనూ రాణిస్తూనే.. మరోవైపు సినిమాల్లో తనదైన శైలిలో రాణిస్తున్నాడు. అయితే పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ కి వెళ్లిన తరువాత  కొందరు ప్రతిపక్ష నాయకులు, గిట్టని వాళ్లు తమ టీవీ ఛానళ్లతో మెగా బ్రదర్స్ గురించి రకరకాలుగా రూమర్స్ క్రియేట్ చేసి మెగా ఫ్యాన్స్ మధ్య కూడా చిచ్చు పెడుతున్నారు. 

Advertisement

ఇక ఈ విషయంపై భోళా శంకర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో హైపర్ ఆది తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. అదేవిధంగా వాల్తేరు వీరయ్య డైరెక్టర్ బాబీ మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ అనుబంధం గురించి వివరించాడు.  ఓ ఇంట్లో  పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో ఆ ఇంటి ఓనర్ వచ్చి షూటింగ్ లో పాల్గొన్న అందరిని చెప్పులు వేసుకొని పని చేస్తున్నారంటూ  కొందరితో గొడవపడి తిట్టారు. అదే సమయంలో పవన్ కళ్యాణ్ కూడా హర్ట్ అయ్యి షూటింగ్ నుంచి వెళ్లిపోయారు.

Advertisement

ఇక ఈ విషయం జరిగిన తరువాత ఓ గంటసేపటికి మెగాస్టార్ చిరంజీవికి తెలిసింది. దీంతో ఆ ఇంటి ఓనర్ ఫోన్ నెంబర్ తీసుకొని వెంటనే ఫోన్ చేసి అతనితో మెగాస్టార్ ఇలా అన్నాడు. సినిమా షూటింగ్ లకి ఇల్లు అద్దెకి ఇచ్చిన తర్వాత అన్నింటికీ సిద్ధంగా ఉండాలి. అలా కాకుండా నా తమ్ముడిని అవమానిస్తావా..?  అంటూ అతడినీ తిట్టారు. తమ్ముడు పవన్ కళ్యాణ్ విషయంలో మెగాస్టార్ చిరంజీవికి అంత ప్రేమ ఉంది. తనని ఎవరైనా ఏమైనా అంటే క్షమిస్తారు. కానీ తమ్ముడు విషయంలో మాత్రం చిరు తన ఉగ్రరూపం చూపిస్తారని బాబీ స్టేజ్ పైన మెగాస్టార్ చిరంజీవి గురించి, ఈ ఇన్సిడెంట్ జరిగిన విషయాన్ని రివీల్ చేశాడు. ప్రస్తుతం ఈ డైరెక్టర్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు :

‘బావగారూ బాగున్నారా’ హీరోయిన్ రచన గుర్తుందా…ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా..?

“సూర్య సన్ ఆఫ్ కృష్ణన్” సినిమాని మిస్ చేసుకున్న టాలీవుడ్ స్టార్ హీరో ఎవరో తెలుసా..?

Visitors Are Also Reading