Home » హీరో కాకముందు శోభన్ బాబుని అవమానించిన వ్యక్తి.. ఆ తరువాత అతను ఏం చేశాడో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..!

హీరో కాకముందు శోభన్ బాబుని అవమానించిన వ్యక్తి.. ఆ తరువాత అతను ఏం చేశాడో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..!

by Anji
Ad

టాలీవుడ్ సోగ్గాడు, నటభూషణడైన శోభన్ బాబు సినిమాలో హీరో అవ్వాలనే ఉద్దేశంతో మద్రాస్ వెళ్లి సినిమా అవకాశాల కోసం ఒక డొక్కు సైకిల్ పై ప్రతీ స్టూడియో చుట్టూ తిరిగే వారు. అప్పటికే అతనికి పెళ్లి అయి పిల్లలు కూడా ఉన్నారు. మద్రాస్ లో ఓ రెంట్ ఇంట్లో భార్య, పిల్లలతో జీవితం కొనసాగిస్తూ తల్లిదండ్రుల నుంచి వచ్చిన వంద రూపాయలతో సంసారం సాగదీసిన శోభన్ బాబు సినిమాల్లో ఏ చిన్న అవకాశం లభించినా సరే సద్వినియోగం చేసుకోవాలనుకునేవారు. ఇక ఆ సమయంలోనే రాజనాల విలన్ గా నటిస్తున్న ఓ మూవీలో రెండు నిమిషాల పాటు నటించే అవకాశం లబించింది.

Advertisement

అప్పటివరకు కాళ్ల చెప్పులు అరిగేలా తిరిగిన శోభన్ బాబు ఆ పాత్రలో నటించేందుకు అవకాశం రావడంతో చాలా సంతోషపడ్డాడు. అప్పట్లో రాజనాల అంటే సినిమాల్లోనే కాదు.. బయట కూడా భయపడేవారు. అతని గొంతులో, మొహంలో అంత గాంభీర్యం ఉండేది. అసలు నటించడమే కొత్త.. మళ్లీ చూస్తేనే భయం కల్పించే రాజనాలతో సన్నివేశం చేయాలనగానే శోభన్ బాబుకి భయం పట్టుకుంది. కానీ వచ్చిన అవకాశాన్ని వదులుకోకూడదనే ఉద్దేశంతో నటించేందుకు ధైర్యం తెచ్చుకున్నాడు. ఇక ఆ సినిమాలో రాజనాలతో రెండు నిమిషాల పాటు అతని పాత్ర ఉండగా.. ఆ పాత్ర చేయడానికి శోభన్ బాబు చాలా రీటేక్స్ తీసుకున్నారు. దీంతో ఆగ్రహించిన రాజనాల ఎవరయ్య ఇతను.. ఎందుకు పట్టుకొచ్చారయ్యా..? నటన రాదు పాడు రాదు.. నేను అసలు ఈ సన్నివేశంలో చేయను.. మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని గట్టిగా అక్కడి సినీ బృందాన్ని తిట్టి వెళ్లిపోయారట.

Advertisement

నలుగురి ముందు రాజనాల తనపై అరవడంతో శోభన్ బాబు తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. కానీ రాకరాక వచ్చిన చిన్న పాత్రలో నటిస్తే కాస్త డబ్బులు వస్తాయని శోభన్ బాబు తన ఆత్మగౌరవం, అభిమానం చంపుకొని మళ్లీ మరొక ఛాన్స్ ఇవ్వండి బ్రతిమిలాడాడు. ఆ సినీ బృందం రాజనాలకి భయపడి మీరు వద్దులేండి.. ఇంటికి వెళ్లిపోండి ఛాన్స్ ఇచ్చి మళ్లీ రాజనాల చేత మాటలు పడలేమండి అని చెప్పేశారు. అవమానపడటం.. వచ్చిన ఛాన్స్ మిస్ అవ్వడంతో శోభన్ బాబు మనస్థాపం చెందాడు. కొద్ది సంవత్సరాలు గడిచిన తరువాత రాజనాల వ్యసనాలకు అలవాటు పడి నటనపై పూర్తి స్థాయిలో ఆసక్తి కోల్పోయాడు. ఆ సమయంలో అతని భార్య కూడా చనిపోయింది. దీంతో రాజనాల మానసికంగా క్రుంగిపోయాడు. ఆదరించాల్సిన కొడుకు కూడా నిర్లక్ష్యం చేయడం.. రూపాయి బిళ్ల కూడా ఇవ్వకుండా కొడుకు గెంటేశాడు. దీంతో చేసేది ఏమి లేక సినీ అవకాశాలు రాక తెలిసిన వాళ్ల వద్దకు వెళ్లి పదో పరకో డబ్బు అడిగి చివరి రోజులు గడుపుతుండేవాడు. ఒకనొక రోజు రాజనాల చాలా దీనస్థితిలో రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే శోభన్ బాబు చూశాడు.

ఇక అప్పటికే శోభన్ బాబు చాలా సినిమాల్లో నటించి కోట్లాది రూపాయలు సంపాదించి పెద్ద పెద్ద కార్లలో తిరుగుతున్నాడు. అనుకోకుండా తనని అవమానించిన రాజనాలని చూసిన శోభన్ బాబు కారు దిగి వెంటనే గురువు గారు ఎలా ఉన్నారు. నేను శోభన్ బాబు నన్ను గుర్తు పట్టారా..? అంటూ కారులో అతడిని ఎక్కించుకొని తన ఇంటికి తీసుకెళ్లి కడుపునిండా భోజనం పెట్టించి ఆ తరువాత పెద్ద సంచి ఇచ్చి ఈ కవర్ లో ఏముందో మీరు తెలుసుకోవాలంటే ఇంటి దగ్గర విప్పాల్సిందే అని చెప్పి అతన్ని ఇంటి దగ్గర కారులో దించేసి వెళ్లిపోయారు. కాసేపటి తరువాత రాజనాల ఆ సంచిలో ఏముందో అని తెరిచి చూడగా.. అందులో రూ.25వేలు కనిపించాయి. దీంతో ఒక్కసారిగా రాజనాలకు కంటి నుంచి నీళ్లు వచ్చాయి. తనను అహంతో అవమానించిన రాజనాలకు కూడా ఒకటి కాదు.. రెండు కాదు రూ.25వేలు ఆర్థిక సహాయం చేశారంటే శోభన్ బాబు మనసు ఎంత ఉదారమైనదో ఇట్టే స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఇలా చాలా మందికి పలు సందర్భాల్లో ఆర్థిక సాయం చేశాడట శోభన్ బాబు. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

 ఈ చిత్రం అసలు రామాయణం కాదంటూ.. షాకింగ్ కామెంట్స్ చేసిన ఆదిపురుష్ రైటర్..!

Rakesh Master : ప్రముఖ కొరియో గ్రాఫర్ రాకేష్ మాస్టర్ మృతి

 

Visitors Are Also Reading