రాజ్ తరుణ్ హీరోగా నటిస్తున్న తాజా మూవీ తిరగబడరా నా సామి టీజర్ లాంచ్ ఈవెంట్ ఇటీవలే హైదరాబాద్ లో జరిగిన విషయం విధితమే. రవికుమార్ చౌదరి దర్శకత్వంలో రాబోతున్న ఈ మూవీలో మాల్వి మల్హోత్రా,మున్నార చోప్రా హీరోయిన్స్ గా నటించారు. కామెడీ ప్లస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీని మల్కాపురం శివకుమార్ నిర్మించారు.
Advertisement
ఈ చిత్రం టీజర్ లాంచ్ ఈవెంట్ లో దర్శకుడు రవికుమార్ చౌదరి నటి మన్నార చోప్రా బహిరంగంగా *ద్దు పెట్టుకున్న విషయం అందరికీ తెలిసిందే. సరదాగా ఫొటోలకు ఫోజులు ఇవ్వమంటూ ఆయనను మన్నార చోప్రా పిలవగా ఆమెతో కలిసి ఫొటోలకు ఫోజు ఇస్తూ వెంటనే ఆమె బుగ్గమీద *ద్దు పెట్టాడు. దీంతో ఒక్క క్షణం ఏం చేయాలో పాలుపోని హీరోయిన్ మన్నార చోప్రా దర్శకుడు చౌదరి చేసిన పనికి నవ్వేి అక్కడి నుంచి వెళ్లిపోయింది. రవికుమార్ చౌదరి వ్యవహారం సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. దర్శకుడు అయి.. మరీ నీచానికి దిగజారాలా అది కూడా పబ్లిక్ గానే అంటూ కామెంట్స్ వినిపించాయి.
Advertisement
దీంతో ఈ విషయంపై దర్శకుడు రవికుమార్ చౌదరి లేటెస్ట్ గా స్పందించారు. ఆమెకు లేని నొప్పి మీకు ఏంటి అని మీడియాను ఎదురు ప్రశ్నించారు. మన్నార చోప్రా నా కూతురు లాంటిది అందుకే ముద్దు పెట్టాను. అయినా మన్నా చోప్రాకు *ద్దు పెట్టడం పై నా ఫ్యామిలీనే నన్ను ప్రశ్నించలేదు. మీరు ఎవరు? ప్రశ్నించడానికి అని రియాక్ట్ అయ్యారు. పబ్లిక్ గా హీరోయిన్ కి *ద్దు పెట్టమే కాకుండా దానిని కవర్ చేసే ప్రయత్నం చేస్తూ.. రవికుమార్ చౌదరి తన అవివేకత్వాన్ని చాటుకుంటున్నాడని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. గతంలో ఇలాగే ప్రముఖ సినిమాటోగ్రాఫర్ చోటా కే నాయుడు కూడా హీరోయిన్ కాజల్ అగర్వాల్ కి పబ్లిక్ గా ఇలా చేసిన విషయం అందరికీ తెలిసిందే.