Home » బంగార్రాజు నుండి యుట్యూబ్ లోకి మరో పాట…!

బంగార్రాజు నుండి యుట్యూబ్ లోకి మరో పాట…!

by AJAY
Ad

నాగార్జున నాగచైతన్య హీరోలుగా నటించిన రీసెంట్ సూపర్ హిట్ సినిమా బంగార్రాజు. ఈ సినిమాకు కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించారు. సోగ్గాడే చిన్నినాయన సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలో నాగార్జునకు జోడీగా రమ్యకృష్ణ నటించగా….చైతూకు జోడీగా హీరోయిన్ గా కృతి శెట్టి నటించింది. ఇక ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ స్వరాలు సమకూర్చిన సంగతి తెలిసిందే. సినిమాలోని పాటలకు కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది.

Advertisement

Banggaraju

Banggaraju

అయితే తాజాగా ఈ సినిమా నుండి “నువ్వు సిగ్గు పడితే” అనే పాటను చిత్ర యూనిట్ విడుదల చేసింది. థియేటర్లలో శ్రోతలను ఆకట్టుకున్న ఈ పాట ఇప్పుడు యూట్యూబ్ లో కూడా విడుదల అయ్యింది. మరి యూట్యూబ్ ను ఈ పాట ఏ విధంగా షేక్ చేస్తుందో చూడాలి. ఇదిలా ఉంటే ఈ సినిమాను నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ మరియు జీ స్టూడియోస్ బ్యానర్ పై నిర్మించారు. ఈ సినిమా థియేటర్ లో కాసుల వర్షం కురిపిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్ లో భాగంగా చిత్రం నుండి ఒక్కో పాటను విడుదల చేస్తున్నారు. ఇప్పటికే సినిమాలోని పలు సాంగ్స్ విడుదల చేసిన చిత్ర బృందం తాజాగా నువ్వు సిగ్గు పడితే పాటను కూడా విడుదల చేసింది.

Advertisement

Visitors Are Also Reading