సాధారణం ఎవ్వరినీ అంత ఎక్కువగా నమ్మకపోవడం చాలా బెటర్. ఎప్పుడూ ఎవ్వరు ఎలా ఉంటారో అర్థం కానీ పరిస్థితి. తాజాగా ఓ ప్లాట్ అద్దెకు తీసుకున్నారు. అయితే వారు ఉండేందుకు అని చెప్పి అద్దెకు తీసుకున్నారు. కానీ వారు అందులో ఏం చేస్తున్నారో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఆ ప్లాట్ ను తనిఖీ చేసిన పోలీసులు.. దెబ్బకు షాక్ అయ్యారు. గుజరాత్ లో ప్లాట్ ను అద్దెకు తీసుకొని గం*యి సాగు చేస్తున్న ముఠా గుట్టును రట్టు చేశారు పోలీసులు.
Advertisement
హైటెక్ స్థాయిలో గం*యి సాగు చూసి పోలీసులే షాక్ కి గురయ్యారు. మొక్కలు పెరగడానికి గది ఉష్ణోగ్రతను అత్యాధునిక పద్దతిలో కరెంట్ ని ఉపయోగించి పెంచారు. సాధారణంగా గం*యిని నేలపై సాగు చేయడం చూసి ఉంటాయి. కానీ పూర్తిగా భిన్నంగా ప్లాట్ ను అద్దెకు తీసుకొని కృతిమంగా సాగు చేస్తోంది ఈ ముఠా. ఈ హైటెక్ గంజాయి సాగును అహ్మదాబాద్ లోని సర్ లేజ్ ప్రాంతంలో గుర్తించారు. ప్రధాన నిందితుడు పరారీలో ఉండగా.. మిగిలిన ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు.
Advertisement
ఈ నిందితులు గం*యి మొక్కలను అత్యాధునిక పద్దతిని ఉపయోగించి గది ఉష్ణోగ్రతను నియంత్రించేవిధంగా ఏర్పాట్లను చేశారు. రెండు ఫ్లాట్ లను రూ.35వేలకు రెంట్ తీసుకున్నారు. ఒక్కో ప్లాట్ లో 100 మొక్కలను పెంచేలా ఏర్పాట్లు చేశారు. మొక్కలు తొందరగా పెరిగేవిధంగా అమైనో యాసిడ్ ఇంజక్షన్ లను ఉపయోగించారు. వీరి నుంచి 200 గం*యి మొక్కల కుండీలను స్వాధీనం చేసుకున్నారు. వీటినీ పరీక్షల కోసం ల్యాబ్ కి పంపించారు పోలీసులు. అందుకే ఎవ్వరినీ కూడా అంత తేలికగా నమ్మి ఇల్లు,లేదా ప్లాట్ అద్దెకు ఇవ్వకూడదని చెబుతున్నారు పోలీసులు. వారి గురించి పూర్తిగా తెలుసుకున్న తరువాతే వారికి అద్దెకు ఇవ్వాలని సూచిస్తున్నారు. లేని యెడల అద్దెకు ఇచ్చిన వారు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. జాగ్రత్త సుమా..!