తెలంగాణ తొలి బాలనటుడిగా సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చి ఎన్టీఆర్, ఏఎన్నార్ కి దీటుగా రాణించిన నటుడు కాంతారావు గురించి తక్కువ మందికే తెలుసు. ఎందుకంటే ఆయన పూర్వకాలం వారికి పరిచయం కానీ.. నేటి తరం వారికి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఇటీవల హైదరాబాద్ రవీంద్రభారతిలో కాంతారావు శత జయంతి వేడుకలు నిర్వహించారు.
Advertisement
ఈ వేడుకలకు హాజరైన కాంతారావు కుమారుడు రాజా భావోద్వేగానికి లోనయ్యారు. పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా తమ తండ్రి ఆస్తులను అమ్ముకొని సినిమాలను తీశారని గుర్తు చేశారు. ఒకప్పుడూ మద్రాస్ బంగ్లాలో ఉన్న మేము.. ఇప్పుడు సిటీకి దూరంలో ఓ అద్దె ఇంట్లో ఉంటున్నామని, రాష్ట్ర ప్రభుత్వం సహకరించి తమకు ఇల్లు కేటాయించాలి కోరారు. మరోవైపు కాంతారావు కొడుకులు ఇద్దరూ కలిసి ఇంటి వద్ద నిర్వహించిన కాంతారావు శతజయంతి వేడుకకి సంబంధించిన ఫోటోను సీవీఎల్ నరసింహారావు తన ఫేస్ బుక్ లో ఓ పోస్ట్ చేశారు.
Advertisement
సూర్యపేట జిల్లా కోదాడ నియోజకవర్గం గుడిబండ అనే మారుమూల గ్రామం నుంచి తెలుగు సినీ పరిశ్రమలోకి కాంతారావు అడుగుపెట్టారు. దాదాపు 400కి పైగా పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాల్లో నటించారు. రవీంద్రభారతిలో నిర్వహించిన కాంతారావు శతజయంతి వేడుకలకు సీఎం కేసీఆర్ హాజరై నివాళులర్పించారు. సినీ కళారంగానికి కాంతారావు చేసిన సేవలను కేసీఆర్ స్మరించుకున్నారు. తెలుగు సినీ కళామతల్లికి ఎన్టీఆర్, ఏఎన్నార్ లు రెండు కళ్లు అయితే కాంతారావు నుదుట తిలకంగా ఖ్యాతి గడించడం తెలంగాణకు గర్వకారణం అని పేర్కొన్నారు సీఎం కేసీఆర్.
Also Read : 2022 అత్యధికంగా వసూలు చేసిన టాప్ 10 భారతీయ సినిమాలు ఇవే..!