Home » గుర్తు పట్టలేనంత మారిపోయిన మహేష్ బాబు చెల్లెలు….ఇప్పుడు ఎక్కడ ఉందో…ఏం చేస్తుందో తెలుసా…!

గుర్తు పట్టలేనంత మారిపోయిన మహేష్ బాబు చెల్లెలు….ఇప్పుడు ఎక్కడ ఉందో…ఏం చేస్తుందో తెలుసా…!

by AJAY
Ad

చైల్డ్ ఆర్టిస్ట్ లు పెద్దయ్యాక హీరోయిన్ లు, హీరోలుగా ఎంట్రీ ఇవ్వడం చూస్తూనే ఉన్నాం. అలనాటి అందాల తార శ్రీదేవి నుండి మొన్నటి బేబీ షామిలి వరకు మొదట చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి పెద్దయ్యాక సినిమా లపై ఉన్న ప్రేమ తో హీరోయిన్ లుగా ఎంట్రీ ఇచ్చినవారే. అయితే అందరూ ఒకేలా ఉండరు కదా. ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ లుగా మెప్పించిన చాలా మంది ప్రస్తుతం సినిమా లకు గుడ్ బై చెప్పి పర్సనల్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నారు.

Advertisement

ఆలాంటి వారిలో మహేష్ బాబు సోదరి కూడా ఒకరు. మహేష్ బాబు సోదరి అంటే అంజలి అనుకుంటారేమో కానేకాదు. ఒక్కడు సినిమాలో మహేష్ బాబు కు చెల్లెలిగా నటించిన బేబీ నిహారిక. ఆ బేబీనే ఇప్పుడు పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలకు తల్లి అయ్యింది. ఒక్కడు సినిమా కంటే ముందు నిహారిక చాల్ సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది. కానీ ఒక్కడు సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడం తో నిహారిక కు మంచి గుర్తింపు లభించింది.

Advertisement

ఈ సినిమాలో తన అన్న ప్రేమ కు సపోర్ట్ చేస్తూ సాధారణమైన అమ్మాయిలా కనిపించి ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా కంటే ముందు నిహారిక వెంకటేష్ హీరోగా నటించిన ప్రేమించుకుందాం రా….మోహన్ బాబు హీరోగా నటించిన యమజాతకుడు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది.

ఒక్కడు సినిమా తరవాత నిహారిక సినిమాలకు పూర్తిగా దూరం అయ్యింది. ఆఫర్ లు వచ్చినా చదువు కోసం సినిమాలను పక్కన పెట్టింది. అంతే కాకుండా నిహారిక ఒక పొలిటికల్ భ్యాగ్రౌండ్ ఉన్న ఫ్యామిలీకి కోడలు అయ్యింది. అంతే కాకుండా ప్రస్తుతం నిహారిక కు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. తాజాగా నిహారిక మీడియా ముందుకు వచ్చింది. మరి ఈ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు రీ ఎంట్రీ ఇవ్వబోతోందా లేదా అన్నది చూడాలి.

Visitors Are Also Reading