పరిచయం :
టాలీవుడ్ లో విభిన్న చిత్రాలతో మెప్పించే హీరోలలో శర్వానంద్ ఒకరు. అయితే శతమానం భవతి సినిమా తరవాత శర్వా కు సరైన హిట్ లేక సతమతం అవుతున్నారు. శర్వానంద్ చివరి సినిమా మహాప్రస్థానం కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఇక తాజాగా శర్వానంద్ హీరోగా ఒకే ఒక జీవితం సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో శర్వానంద్ హీరోగా నటించగా అక్కినేని అమల శర్వాకు తల్లి పాత్రలో నటించింది. టైం ట్రావెల్ కతాంశంతో ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమాలో వెన్నెల కిషోర్ ప్రియదర్శి నాజర్ ముఖ్యమైన పాత్రలలో నటించారు. శ్రీ కార్తిక్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఇక భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఎలా ఉంది..? ఈసారైనా శర్వానంద్ కు హిట్ పడిందా..? లేదా అన్న వివరాలు ఇప్పుడు చూద్దాం…
Advertisement
ఇవి కూడా చదవండి : వైరల్ సెలబ్రెటీ జంట.. మహాలక్ష్మి పిల్లల విషయంలో ఆ కండిషన్ పెట్టిందంటున్న చంద్రశేఖర్..!
కథ కథనం :
శర్వానంద్ (ఆది) చిన్న వయసులోనే తన తల్లిని కోల్పోతాడు. ఆదికి తల్లి అన్నా సంగీతమన్నా విపరీతమైన ఇష్టం. సంగీతం అంటే చాలా ఇష్టం కానీ స్టేజ్ పై పాడాలంటే భయం ఉంటుంది. ఇదిలా ఉంటే ప్రియదర్శి చైతన్య అనే పాత్రలో నటించాడు. చైతన్య తన మనసుకు నచ్చిన అమ్మాయిని ఎలాగైనా సరే పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకుంటాడు. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని వచ్చిన సంబంధాలు అన్నింటిని రిజెక్ట్ చేస్తూ ఉంటాడు.
Advertisement
ఇక ప్రియదర్శికి పెళ్లి చూపుల్లో చివరగా ఒక అమ్మాయి నచ్చుతుంది కానీ అదే సమయంలో చిన్నప్పుడు తాను మిస్సయిన స్కూల్ ఫ్రెండ్ ఫోటో చూసి ఆమెను ఎలా మిస్ చేసుకున్నాను అని బాధపడుతూ ఉంటాడు. ఈ సినిమాలో శ్రీనివాస్ అనే పాత్రలో వెన్నెల కిషోర్ నటించాడు స్కూల్ ఏజ్ లో సరిగా చదువుకోకపోవడంతో శ్రీనివాస్ రియల్ ఎస్టేట్ బ్రోకర్ గా స్థిరపడతాడు. అందరికీ అద్దె ఇల్లులు వెతికి పెడుతూ ఉంటాడు. కాగా శ్రీనివాస్ అనుకోకుండా నాజర్ (పాల్) అనే ఒక సైంటిస్టుకు ఇల్లును అద్దెకు ఇప్పిస్తాడు. ఇక సైంటిస్ట్ పాల్.. శర్వానంద్, ప్రియదర్శి, వెన్నెల కిషోర్ లకు ఒక ఆఫర్ ఇచ్చి ముగ్గురిని ట్రైమ్ ట్రావెల్ చేయించేలా ఒప్పిస్తాడు. సైంటిస్ట్ పాల్ వల్ల ముగ్గురు 20 ఏళ్లు వెనక్కి వెళతారు. ఆ 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది? విధిని మార్చుకో గలిగారా ..? అన్నదే ఈ సినిమా కథ .
టైం ట్రావెల్ నేపథ్యంలో సినిమా తీయడం అంటే చాలా కష్టం. ఇక ఈ సినిమాలో ఎమోషనల్ సీన్స్ తో దర్శకుడు మెప్పించగలిగాడు. సినిమా డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిప్పటికీ కామెడీ….ఎమోషనల్ సీన్స్ బాగా రాసుకున్నాడు. కథ కొత్తగా అనిపించడం తో పాటు వినోదాత్మకంగా తీసి మెప్పించగాలిగాడు. దర్శకత్వం మరియు స్క్రీన్ ప్లే కూడా బాగున్నాయి. ఇంటర్వెల్ కు ముందు వచ్చే ట్విస్ట్ అదిరిపోయింది. అంతే కాకుండా సినిమా క్లైమాక్స్ కూడా చాలా ఎమోషనల్ గా ఉండటం తో మంచి సినిమా చూసిన ఫీల్ ప్రేక్షకులకి కలుగుతుంది. ఈ సినిమా ను ఖచ్చితంగా థియేటర్ లో ఫ్యామిలీ తో కలిసి ఎంజాయ్ చేయవచ్చు.
ఇవి కూడా చదవండి : రేణూ దేశాయ్ ఫ్యామిలీ గురించి ఎవ్వరికీ తెలియని నిజాలు…?