అనంతపురం జిల్లాను వరదలు వణికిస్తున్నాయి. చెరువులు వాగులు పొంగి పొర్లుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. హిందూపురం నుండి అనంతపురంకు రాకపోకలు నిలిపివేశారు.
తెలంగాణలో నేడు రేపు పలు చోట్లు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు.
Advertisement
చెన్నై లో రన్నింగ్ ట్రైన్ నుండి తోసేసిన కేసులో మరణించిన యువతి సత్య కుటుంబంలో మరో విషాదం చోటు చేసుకుంది. కూతురు మరణాన్ని తట్టుకోలేక తండ్రి గుండెపోటుతో చనిపోయారు. రన్నింగ్ ట్రైన్ నుండి యువతిని తోసేసి దారుణంగా హతమార్చిన ప్రియుడు సతీష్ ను పోలీసులు అరెస్టు చేశారు.
ఛత్తీస్ గడ్‌లో భూకంపం చోటు చేసుకుంది. ఛత్తీస్ గడ్ లోని అంబికాపూర్ కు 65 కి.మీ దూరంలో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. రిక్టర్ స్కేలుపై తీవ్రత 4.8గా నమోదయ్యింది.
Advertisement
ఇరిగేషన్ శాఖ పై సీఎం జగన్ సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సమావేశం జరగనుంది. పోలవరం సహా కీలక ప్రాజెక్టుల పనుల పురోగతిపై ముఖ్యమంత్రి జగన్ చర్చించే అవకాశాలు ఉన్నాయి.
మునుగోడు ఉప ఎన్నికకి ఇవాళ్టితో నామినేషన్ల స్వీకరణ గడువు ముగియనుంది. ఇప్పటివరకు 56 మంది అభ్యర్థులు 87 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. రేపు నామినేషన్లను పరిశీలించనున్నారు. 17వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు చివరి గడువు విధించారు.
అనకాపల్లి జిల్లాలో విదేశీ వ్యవహారాల సహాయమంత్రి మురళీ ధరన్ మూడు రోజుల పాటు పర్యటించనున్నారు.కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు తీరును కేంద్ర మంత్రి పరిశీలించనున్నారు
తెలంగాణలో ఆరు పేపర్లతోనే టెన్త్ పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్నయం తీసుకుంది. గత విద్యా సంవత్సరం మాదిరిగానే పరీక్షల నిర్వహణకు నిర్ణయం తీసుకుంది. విద్యాశాఖ ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.