ఆంధ్రప్రదేశ్‌లో 14 సంవత్సరాల కాలం పాటు ముఖ్యమంత్రిగా పని చేసిన దిగ్గ రాజకీయ నేత, సుదీర్ఘకాలం విపక్ష నేతగా ఉన్న నేతకు సైతం కబ్జాల బాధ తప్పలేదని చెప్పవచ్చు. చిత్తూరు జిల్లాలో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు కుటుంబ భూమిని కొందరూ కబ్జా చేసారు. దానిని కాపాడుకునేందుకు ఆ కుటుంబం రోడ్డుకు ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది. అధికారులు మాత్రం ఎప్పటిమాదిరిగానే ఎవరి దస్త్రాలు వారు తెచ్చుకోండి పరిశీలించి న్యాయం చేస్తామని పేర్కొంటున్నారు.
Advertisement
టీడీపీ అధినేత చంద్రబాబుకు వైసీపీ ప్రభుత్వ హయాంలో మరొక అవమానం తప్పలేదు. ఇప్పటికే తాను 8 సార్లు గెలుస్తూ వస్తున్న కుప్పం నియోజకవర్గంలో జరుగుతున్న ప్రతీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటములతో అవమానాల పరంపర కొనసాగుతున్నది. దీనికి తోడు ఇప్పుడు అదే జిల్లాలో తన కుటుంబానికి ఉన్న స్థలాన్ని సైతం కబ్జాలు చేయడం మొదలు పెట్టారు చంద్రబాబు. చంద్రబాబుపై ప్రభుత్వ వైఖరీని గమనించిన కొందరూ ఆయన పాత నియోజకవర్గం చంద్రగిరిలో ఉన్న ఆయన కుటుంబ భూమిని కబ్జా చేసారు. దానిని విడిపించేందుకు ఆ కుటుంబం నానా ఇబ్బందులు పడుతోంది.
Also Read : ఆదివాసుల అకౌంట్లలో రూ.60 కోట్లు జమ.. ఎలాగో తెలుసా..?
Advertisement
చంద్రబాబు పాత నియోజకవర్గం చంద్రగిరిలోని శేషాపురంలో ఆయన తండ్రి వద్ద నుంచి సోదరుడు రామ్మూర్తి నాయుడికి వారసత్వంగా 87 సెంట్ల భూమిని కొందరూ తాజాగా కబ్జా చేశారు. ఈ భూమిని నారా కృష్ణమనాయుడు నుంచి చంద్రబాబు తండ్రి ఖర్మూర నాయుడు 1989లో కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయించారు. దీనిని తన కుమారులు అయినటువంటి చంద్రబాబునాయుడు, రామ్మూర్తి నాయుడులకు ఇచ్చారు. ఇలా తనకు వచ్చిన స్థలాన్ని చంద్రబాబు ప్రాథమిక ఆరోగ్యకేంద్రం, టీటీడీ కల్యాణ మండలం కోసం ఉచితంగా ఇచ్చారు. రామ్మూర్తి నాయుడుకు ఉన్న భూమిపై కొందరూ కన్నేసారు. రెవెన్యూ రికార్డులు చూసుకోకపోవడంతో తన తండ్రికి స్థలం అమ్మిన వారి కుటుంబమే దీనిపై కన్నేసింది. రాళ్లు జరిపేసి భూమిని స్వాధీనం చేసుకున్నది.
ముఖ్యంగా నారా కృష్ణమనాయుడి నుంచి చంద్రబాబు తండ్రి ఖర్జూరా నాయుడు ఈ భూమిలో పూర్తి భాగం కొనుక్కోలేదు అని, కొంత భాగం తీసుకోగా.. మిగిలిన భాగంలోనే తాము రాళ్లు పాతామని, ఇది తమ భూమే అని ప్రస్తుతం దానిని కబ్జా చేసుకున్న రాజేంద్రనాయుడు పేర్కొంటున్నారు. కొంత భాగం తీసుకోవడం వల్ల ఆన్‌లైన్‌లో పేరు మారలేదని చెబుతున్నారు. ఇది కాస్తా రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం కావడంతో రెవెన్యూ అధికారులు ఇరు వర్గాల నుంచి డాక్యుమెంట్లను తీసుకుని పరిశీలిస్తామని పేర్కొంటున్నారు.
Also Read : బుక్ మై షోకు భీమ్లానాయక్ డిస్ట్రిబ్యూటర్ షాక్..!