ప్రతి స్వతంత్ర పౌరుడికి ఓటు హక్కు అనేది చాలా ముఖ్యం. అలాంటి ఓటు హక్కును వినియోగించుకోవడం మన బాధ్యత కూడా. ఎన్నికలు వస్తే కానీ ఓటు గురించి ఎవరు ఆలోచించరు. కేవలం భారతదేశం లోనే కాకుండా ఓటు హక్కు అనేది ఎక్కడైనా ఉంటుంది. అక్కడ కూడా ఎన్నికల సమయంలోనే ఓటర్లు గుర్తుకొస్తారు. ఎన్నికలు జరిగిన తర్వాత మళ్లీ ఆ నాయకులు కనిపించిన పాపాన పోరు. అలాంటి ఓటు హక్కు మన దేశంలో 18 సంవత్సరాలు నిండితే పొందొచ్చు.
Advertisement
also read:శీతాకాలంలో వెల్లుల్లి తింటే.. ఎంత మేలంటే..!!
ఇతర దేశాల్లో కూడా ఇదే రూల్ వర్తిస్తుంది. కానీ ఆ ఒక్క దేశంలో ఓటు హక్కు వయసును తగ్గించారు. పదహారేళ్ళకే ఓటు హక్కు ఇవ్వాలని ఒక జీవో తీసుకొచ్చారు.. అమలు చేశారు కూడా.. మరి ఆ ఓటు హక్కు కల్పించింది ఏ దేశమో ఏంటో ఇప్పుడు చూద్దాం.. ప్రతి ఒక్క మనిషి జీవితంలో అన్నిటికంటే శక్తివంతమైనది ఓటు హక్కు అని తెలుసుకోవాలి. మనం ఓటు హక్కును ఏ విధంగా వినియోగించుకుంటామో అలాంటి పాలకులే మనల్ని పాలిస్తారు. కాబట్టి ఓటు విలువ ఎంత గొప్పదో ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి.
Advertisement
అయితే ప్రస్తుతం న్యూజిలాండ్ లో ఓటు హక్కు ఏజ్ తగ్గిస్తూ అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతోంది. 18 ఏళ్ల వయసు వారికి మాత్రమే ఓటు హక్కు ఉండగా దానిని పదహారేళ్లకు తగ్గించేందుకు ఆలోచన చేస్తుందట. అయితే ఇప్పటికే కొన్ని దేశాలు ఈ ఆలోచన చేస్తూ అమలు చేస్తున్నాయి. అయితే ఈ ఓటు హక్కు తగ్గింపు వయసు అమలు కావాలంటే న్యూజిలాండ్ పార్లమెంట్లో 75 శాతం మంది సభ్యుల మద్దతు అవసరం. వీరి మద్దతు ఇస్తే పదహారేళ్ల కుర్రాడు కూడా ఓటు వేసి వారి నాయకుడిని ఎన్నుకోవచ్చు.
also read: