త్రివిక్రమ్ శ్రీనివాస్‌ని దర్శకునిగా పరిచయం చేస్తూ ప్రముఖ నిర్మాణ సంస్థ స్రవంతి మూవీస్ పతాకంపై స్రవంతి రవికిషోర్ నిర్మించిన సినిమా నువ్వే నువ్వే. ఈ సినిమా నేటికి 20 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ చిత్రంలో తరుణ్, శ్రియ జంటగా నటించారు. కాలంతో సంబంధం లేకుండా కొన్ని సినిమాలు మన మనసులను తాకుతాయి. అన్ని వయస్సుల ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. అలాంటి సినిమాల్లో నువ్వే నువ్వే ఒకటి.
ఈ సినిమా వచ్చి 20 ఏళ్లైనా ఇప్పటికీ ఈ సినిమా టీవీలో వస్తే ప్రేక్షకులు సోఫాలో కూర్చొని మరీ చూస్తారు. మళ్లీ మళ్లీ డైలాగ్‌లను యూట్యూబ్‌లో వీడియో పెట్టుకుని మరీ వింటారు. ప్రేమ, కుటుంబ అనుబంధాలకు వినోదం మేళవించి రూపొందించిన సినిమా నువ్వే నువ్వే. కూతురిపై తండ్రి ప్రేమను మాత్రమే కాదు, బాధ్యతను కూడా చూపించారు. ముఖ్యంగా స్వయంవరం, చిరునవ్వుతో, నువ్వేకావాలి, నువ్వు నాకు నచ్చావ్ చిత్రాలతో టాప్ రైటర్‌గా ఎదిగిన త్రివిక్రమ్ నువ్వే నువ్వేతో దర్శకునిగా పరిచయమయ్యారు. తొలి చిత్రంతోనే దర్శకునిగాతన ప్రతిబను చాటారు త్రివిక్రమ్.
Advertisement
Advertisement
ఇక నువ్వే నువ్వే సినిమాకు ప్రేక్షకుల అభిమానంతో పాటు పురస్కారాలు కూడా దక్కాయి. నంది అవార్డుల్లో ఉత్తమ చిత్రం విభాగంలో సెకండ్ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్‌గా నిలిచింది. వెండి నందిని స్రవంతి రవికిషోర్‌కి అందించింది. రచయితగా త్రివిక్రమ్ శ్రీనివాస్ నంది అవార్డు అందుకున్నారు. ఫిలింఫేర్ సౌత్ అవార్డుల్లో ఉత్తమ సహాయనటుడిగా ప్రకాశ్ రాజ్ పురస్కారం అందుకున్నారు. ఈ సినిమా 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కొన్ని థియేటర్లలో విడుదల చేస్తున్నారు. అక్టోబర్ 10 మధ్యాహ్నం 2 గంటలకు ఆ చిత్రబృందం అంతా కలిసి ఏఎంబీ థియేటర్లో నువ్వే నువ్వే సినిమా వీక్షించనున్నారు.
Also Read : సినిమాలో సరదాగా ఎన్టీఆర్ చెప్పిన మాట నిజం అయ్యింది గా ! ఇది గుర్తుందా ?