గత శనివారం ఉదయం చంద్రబాబును అరెస్ట్ చేయడం.. ఆదివారం ఉదయం ఆయన్ని సీఐడీ కోర్టులో హాజరుపరచి 14 రోజులపాటు రిమాండ్ విధించడం వంటి తీరు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
Advertisement
చంద్రబాబు ను అరెస్ట్ పూర్తిగా అనైతికమని, సరైన ఆధారాలు లేకుండా, కనీసం ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా, రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించారని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సైతం చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేసిన తీరును తీవ్రంగా ఖండించారు.
చంద్రబాబు నాయుడి స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌లో అరెస్ట్ చేయడంతో టీడీపీ వర్గాలు తీవ్ర అసహనానికి గురవయ్యారు. అధికార పార్టీలో ఉన్న వైసీపీ నాయకులు చంద్రబాబు నాయుడు అరెస్టు కావడంతో సంబరాలు జరుపుకుంటున్నారు.
ఇది శాంపిల్ మాత్రమే.. చంద్రబాబు జీవితం మొత్తం జైల్లోనే గడపాల్సి ఉంటుందని, తీగ లాగితే డొంక కదులుతుందని అంటు వైసీపీ నేతలు చంద్రబాబు నాయుడు పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
Advertisement
2021లో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌లో చంద్రబాబు నాయుడి పేరును చేర్చిన సీఐడీ అధికారులు.. రిమాండ్ రిపోర్టులో ఆయన తనయుడు నారా లోకేశ్ పేరును కూడా చేర్చారు. ఏదో ఒక కేసులో నారా లోకేశ్‌ను సైతం అరెస్ట్ చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి.
అదే కనుక నిజమై నారా లోకేశ్‌ను కూడా అరెస్ట్ చేస్తే.. టీడీపీ శ్రేణులను ఎవరు ముందుకు నడుపుతారనే ప్రశ్న అందరిలో మొదలయ్యింది. ఓ పక్క నారా బ్రాహ్మణి రాజకీయాల్లోకి వస్తారని ప్రచారం జరుగుతుండగా.. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ టీడీపీలోకి వచ్చి పార్టీని కాపాడాలని అభిమానులు కోరుకుంటున్నారు.
అయితే తారక్ ఇప్పటివరకు చంద్రబాబు నాయుడు అరెస్ట్ పై ఏ విధంగా స్పందించలేదు. అలాంటిది తారక్ వైసీపీకి వ్యతిరేకంగా పోరాడుతూ.. పార్టీ గెలుపు బాధ్యతను తన భుజానికి ఎత్తుకుంటారని ఆశించడం అత్యాశే అవుతుందని చాలా మంది అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి .
Also Read
- చంద్రబాబు అరెస్టుతో కుప్పకూలిన హెరిటేజ్ కంపెనీ షేర్ల విలువ..! అమ్మాలా లేక కొనాలా..?
- రాత్రిపూట ఏ టైం కి అన్నం తినాలి..? ఈ సమయంలో మాత్రం అస్సలు వద్దు..!
- వెంకటేష్ హీరో అవ్వడం వెనుక.. ఇంత పెద్ద కథ ఉందా..? మీకు తెలుసా..?