Home » ప్రాణ స్నేహితుడిని నమ్మి.. దారుణంగా మోసపోయిన జూనియర్ ఎన్టీఆర్!

ప్రాణ స్నేహితుడిని నమ్మి.. దారుణంగా మోసపోయిన జూనియర్ ఎన్టీఆర్!

by Bunty
Ad

జూనియర్ ఎన్టీఆర్ నందమూరి వంశం నుంచి వచ్చిన హీరోలలో ఒకరు. నందమూరి వంశంలో ఎన్టీఆర్, బాలయ్య తర్వాత అంతటి పవర్ఫుల్ హీరో ఎన్టీఆర్. అచ్చం తాత పోలికలతోనే ఉండే ఈ కుర్రాడు నిన్ను చూడాలని సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమయ్యాడు. ఇప్పుడు ఎన్టీఆర్ టాలీవుడ్ టాప్ హీరోగా ఉన్నాడు. ఇటీవల ఆర్ఆర్ఆర్ సినిమాతో పెద్ద స్టార్ అయ్యాడు ఎన్టీఆర్. ఇది ఇలా ఉండగా,  అప్పట్లో ఎన్టీఆర్ కి ఎంతో సన్నిహితుడుగా ఉండే ఒక స్నేహితుడు ఉండేవాడు.

Advertisement

అయితే, ఆ ఎన్టీఆర్‌ స్నేహితుడు… ఒక ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దగ్గర ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి నీకు కాల్ షీట్స్ ఇప్పిస్తాను అని చెప్పి,ఆ నిర్మాత దగ్గర భారీ మొత్తంలో అడ్వాన్స్ తీసుకున్నాడట. ఆ తర్వాత.. ఎన్టీఆర్‌ స్నేహితుడు సైలెంట్‌ అయిపోయాడట. అనంతరం… సింహాద్రి తర్వాత ఎన్టీఆర్ ఆంధ్రావాలా, సాంబ, నరసింహుడు, నా అల్లుడు ఇలా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. కానీ మాకు మాత్రం సినిమా చేసి పెట్టడం లేదు అంటూ నేరుగా ఎన్టీఆర్ వద్దకి వెళ్లారట ఆ నిర్మాతలు. మా దగ్గర అంత అడ్వాన్స్ డబ్బులు తీసుకొని మా సినిమా చేయవా, నిన్ను నమ్మి అప్పు చేసి డబ్బు తెచ్చి, అడ్వాన్స్ గా నీకు ఇచ్చాము. వాటికి వడ్డీలు కట్టలేక చచ్చిపోతున్నాము. నువ్వు మాత్రం మాకు కాల్ షీట్స్ ఇస్తాను అని చెప్పి ఇవ్వడం లేదు అని ఎన్టీఆర్ ని నిలదీశాడట.

Advertisement

అప్పుడు ఎన్టీఆర్ ఒక్కసారిగా షాక్ అయ్యి నేనెప్పుడూ మీకు కాల్ షీట్స్ ఇస్తాను అని చెప్పాను అన్నాడట. అప్పుడు ఆ నిర్మాత నీ స్నేహితుడు నీ కాల్ షీట్స్ ఇస్తాను అని చెప్పి మా దగ్గర చాలా డబ్బులు తీసుకున్నాడు అని తెలిపారు. దీంతో మోసపోయానని గ్రహించిన ఎన్టీఆర్, తన దగ్గర ఉన్న మొత్తం డబ్బులను ఆ నిర్మాతకు ఇచ్చారట. నమ్మి చేరదీస్తే ఎంత మోసం చేస్తావా అంటూ ఎన్టీఆర్ తన బెస్ట్ ఫ్రెండ్ ని బాగా మందలించి దూరం పెట్టేసాడట. అయితే, ఆ ఎన్టీఆర్ స్నేహితుడి వివరాలు ఇప్పటికీ గోప్యంగానే ఉన్నాయి.

READ ALSO : తెలంగాణ ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్ న్యూస్…వారికి మరో అవకాశం

Visitors Are Also Reading