Home » హైకోర్టు మెట్లు ఎక్కిన ఎన్టీఆర్.. మహిళ మీద కేసు నమోదు..!

హైకోర్టు మెట్లు ఎక్కిన ఎన్టీఆర్.. మహిళ మీద కేసు నమోదు..!

by Sravya
Ad

జూనియర్ ఎన్టీఆర్ గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ మామూలు క్రేజ్ కాదు. తారక్ వివాదాలకు కూడా దూరంగా ఉంటారు. టైం దొరికినప్పుడు ఫ్యామిలీ తో సరదాగా గడుపుతారు. మిగిలిన సమయంలో షూటింగ్ తో బిజీగా ఉంటారు. తన ఇంటి స్థలం విషయంలో వివాదం నెలకొనడంతో తారక్ తెలంగాణ హైకోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది. జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ లో ఉన్న 681 చదరపు గజాల స్థలం విషయంలో ఈ వివాదం తలెత్తిందని తెలుస్తోంది.

Advertisement

2003లోని ఎన్టీఆర్ సుంకు గీత అనే మహిళ నుండి స్థలాన్ని కొన్నారు ఆ సమయంలో చట్టపరంగా ఇంటి నిర్మాణానికి అవసరమైన అన్ని అనుమతులు కూడా పొందారు. ఇంటి నిర్మాణాన్ని చేపట్టారు. జూనియర్ ఎన్టీఆర్ కి ఎవరైతే స్థలాన్ని అమ్మారో ఆ వ్యక్తులు 1966లో ఆ స్థలాన్ని తమ వద్ద తనక పెట్టి రుణాలు పొందాలని ప్రముఖ బ్యాంకులు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండస్ఇండ్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఓరియెంటెడ్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ డిఆర్టి ను ఆశ్రయించడం జరిగింది.

Advertisement

Also read:

రికవరీ ట్రబ్యునల్ బ్యాంకులకు అనుకూలంగా తీర్పు ఇచ్చిన నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ డిఆర్టి లో పిటిషన్ దాఖలు చేయగా ఆ స్థలం మీద బ్యాంకులకు హక్కు ఉన్నట్లు డిఆర్డి నుండి తీర్పు వచ్చింది. జూనియర్ ఎన్టీఆర్ ఫిర్యాదు మేరకు భూమిని విక్రయించిన గీతం మీద కేసు నమోదు చేయడం జరిగింది. వేర్వేరు కారణాల వలన ఈ కేసు విచారణ జూన్ నెల 6వ తేదీకి వాయిదా పడింది. గీత అనే మహిళా చేసిన మోసం వలన జూనియర్ ఎన్టీఆర్ కోర్టు మెత్తులు ఎక్కాల్సి వచ్చింది.

తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading