యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగాస్టార్ చిరంజీవిల మధ్య ఎలాంటి బంధం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రీసెంట్ గా చిరు తనయుడు రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి ఆర్ఆర్ఆర్ సినిమాలో నటించారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో రామ్ చరణ్ గురించి ఎన్టీఆర్…ఎన్టీఆర్ గురించి రామ్ చరణ్ ఎంతో గొప్పగా చెప్పారు. చరణ్ తన క్లోజ్ ఫ్రెండ్ అని తన భార్య ప్రణిత పుట్టిన రోజు తరవాత రోజే చరణ్ బర్త్ డే అని తెలిపారు.
Advertisement
అంతే కాకుండా చరణ్ ప్రతి పుట్టిన రోజుకు అతడితో కలిసి రాత్రి కార్ లో షికారుకు వెళతానని ఎన్టీఆర్ వెల్లడించారు. ఇక ఎన్టీఆర్ సినిమాలకు కూడా చిరంజీవి సపోర్ట్ చేస్తుంటారు. ఎన్టీఆర్ మంచి నటుడు అని పొగుడుతారు. ఆర్ఆర్ఆర్ సినిమాలో కూడా ఎన్టీఆర్ పర్ఫామెన్స్ బాగుందని చిరు అన్నారు. ఇక చిరు ఎన్టీఆర్ ల మధ్య ఎంతో అనుబంధం ఉండగా సీనియర్ దర్శకుడు గీతా కృష్ణ చేసిన వ్యాక్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
Advertisement
చిరంజీవి సొంతంగా ఈ స్థాయికి వచ్చారని అన్నారు. అంతే కాకుండా తాను కోకిల సినిమాకు దర్శకత్వం వహిస్తున్న సమయంలో పవన్ కల్యాణ్ ను చిరు తన వద్దకు పంపించారని చెప్పాడు. డైరెక్టర్ కావాలా హీరో కావాలా అన్న సందిగ్దంలో ఉన్నాడని చెప్పారు. అప్పడు చిరంజీవిలా ఉండటానికి ట్రై చేయవద్దని చిరు అంటే ఒక్కరే ఆయన టాలెంట్ వేరు అని చెప్పానని అన్నారు. అంతేకాకుండా ఎన్టీఆర్ బ్లడ్ ఇమేజ్ ను వాడుకున్నాడని అన్నారు.
ALSO READ : RAJAMOULI : రాజమౌళి తీసిన 11 సినిమాలు వాటి బడ్జెట్ వివరాలు, కలెక్షన్స్… !
ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఎన్టీఆర్ ఎక్కువగా మాట్లాడేవారని కానీ ఒకరు చెప్పడం వల్ల మానేశారని అన్నారు. ఓ ఇంటర్వ్యూలో చిరంజీవి ఎవరో తెలియదని అన్నారని…దాంతో నాగార్జున వెళ్లి మాట్లాడగా ఆ తరవాత అలాంటి కామెంట్లు చేయలేదని చెప్పాడు. అయితే ఇందులో ఎంత వరకూ నిజం ఉందో తెలియదు. ఎన్టీఆర్ మాట్లాడినట్టుగా వీడియో కూడా ఇప్పటి వరకూ బయటకు రాలేదు.