దర్శకధీరుడు రాజమౌళి ఇండియాలోనే టాప్ డైరెక్టర్ గా మారారు. ఇప్పటి వరకూ జక్కన్న తీసిన అన్ని సినిమాలు కూడా సూపర్ హిట్లు కావడంతో ఫ్లాప్ ఎరగని డైరెక్టర్ గా కూడా పేరు సంపాదించుకున్నారు. ఇక జక్కన్న సినిమాలు ప్రస్తుతం వందల కోట్ల కలెక్షన్ లను రాబడుతున్నాయి. రాజమౌళి దర్శకత్వంలో ఇప్పటి వరకూ మొత్తం 11 సినిమాలు వచ్చాయి. వాటి బడ్జెట్ మరియు కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.
Advertisement
ALSO READ : ఆ విషయంలో రాజమౌళి ని తప్పుబడుతున్న ఎన్టీఆర్ ఫాన్స్ ! వాళ్ళ కోపం న్యాయమేనా ?
స్టూడెంట్ నంబర్ వన్ సినిమాను 4 కోట్లకు అమ్మగా 11 కోట్లు వసూలు చేసింది.
ఎన్టీఆర్ హీరోగా నటించిన సింహాద్రి సినిమాను 13కోట్లకు విక్రయించగా 26కోట్లు వసూలు చేసింది.
నితిన్ హీరోగా నటించిన సై సినిమాను 7కోట్లకు విక్రయించగా 9.5కోట్లు వసూలు చేసింది.
ప్రభాస్ హీరోగా నటించిన ఛత్రపతి సినిమాను 10కోట్లతో నిర్మించి 13కోట్లకు విక్రయించారు. ఈ సినిమా మొత్తం 21కోట్లు రాబట్టింది.
Advertisement
రవితేజ హీరోగా నటించిన విక్రమార్కుడు సినిమాను 11 కోట్లతో నిర్మించారు. ఈ సినిమాను 14 కోట్లకు విక్రయించగా 14.50 కోట్ల కలెక్షన్ లను రాబట్టింది.
యమదొంగ సినిమాను 18 కోట్లతో నిర్మించారు. ఈ సినిమాను 22 కోట్లకు విక్రయించగా 28కోట్లను రాబట్టింది.
రామ్ చరణ్ హీరోగా నటించిన మగధీరను 44కోట్లతో నిర్మించగా 48కోట్లకు విక్రయించారు. ఈ సినిమా 150 కోట్ల కలెక్షన్ లను రాబట్టింది.
సునీల్ హీరోగా తెరకెక్కించిన మర్యాదరామన్న సినిమాను 14కోట్లతో నిర్మించి 20 కోట్లకు అమ్మారు. ఈ సినిమా 29 కోట్లను వసూలు చేసింది.
ఈగ సినిమాను 26కోట్లతో నిర్మించగా 32 కోట్లకు విక్రయించారు. ఈ సినిమా 46 కోట్లను వసూలు చేసింది.
బాహుబలి బిగినింగ్ ను 136 కోట్లతో నిర్మించగా 191 కోట్లకు విక్రయించారు. ఈ సినిమా 602 కోట్లను వసూలు చేసింది.
బాహుబలి కంక్లూజన్ ను రూ.250 కోట్లతో నిర్మించారు. ఈ సినిమా 1917 కోట్లను వసూలు చేసింది.