Home » ప్రెసిడెంట్ల ఒప్పందాల‌తో ఫ్యాన్స్ ర‌చ్చ‌ను ఆప‌గ‌ల‌రా?

ప్రెసిడెంట్ల ఒప్పందాల‌తో ఫ్యాన్స్ ర‌చ్చ‌ను ఆప‌గ‌ల‌రా?

by Bunty
Ad

2022 జ‌న‌వ‌రి 7వ తేదీన భార‌తీయ సినిమా రంగంలో ఓ అద్భుతం ఆవిష్కృతం కాబోతున్న‌ది. సుమారు 10వేల‌కు పైగా థియేట‌ర్ల‌లో చారిత్రాత్మ‌క సినిమా ఆర్ఆర్ఆర్ రిలీజ్ కాబోతున్న‌ది. ఈ సినిమాపై అంచ‌నాలు భారీగా ఉన్నాయి. ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ వంటి అగ్ర‌హీరోలు ఈ చిత్రంలో న‌టించారు. ఇకఇద్ద‌రికీ తెలుగురాష్ట్రాల్లో ఎంత‌టి క్రేజ్ ఉన్న‌దో చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఈ మూవీ కోసం ఎన్నోరోజులుగా అభిమానులు ఎదురుచూస్తున్నారు.

స్టార్ హీరోలు ఇద్ద‌రు ఒకే సినిమాలో న‌టిస్తుండ‌టంతో ఇద్ద‌ర్ని బ్యాలెన్స్ చేస్తూ సినిమాను చిత్రీక‌రించ‌డం అంటే క‌త్తిమీద సాములాంటిదే. అయిన‌ప్ప‌టికీ రాజ‌మౌళి ఆ ఫీట్‌ను సాధించారు. కాగా, ఇప్పుడు అందిముందున్న ప్ర‌శ్న ఏమంటే, సినిమా థియేట‌ర్ల వ‌ద్ద ఫ్యాన్స్ హంగామా ఎలా ఉండ‌బోతుందో ఊహించుకుంటేనే క‌ష్టంగా ఉంది. థియేట‌ర్ల వ‌ద్ద ఎలాంటి ర‌చ్చ జ‌ర‌గ‌కుండా ఉండేందుకు ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ అభిమాన సంఘాల అధ్య‌క్షులు కొన్ని ఒప్పందాలు చేసుకున్నార‌ట‌. ఈ ఒప్పందం ప్ర‌కారం, కొన్ని ధియేట‌ర్ల‌లో ఎన్టీయార్ ఫ్యాన్స్‌, కొన్ని థియేట‌ర్ల‌లో రామ్ చ‌ర‌ణ్ ఫ్యాన్స్ సినిమా చూడాల‌ని, ఫ్లెక్సీ, కటౌట్ల విష‌యంలో కూడా ఇదే విధానాన్ని ఫాలో కావాల‌ని, ఒక కామ‌న్ సినిమా చూసిన‌ట్టుగా ఈ చిత్రాన్ని కూడా చూడాల‌ని అభిమాన సంఘాల నాయ‌కులు ఒప్పందాలు చేసుకున్నార‌ట‌.

Advertisement

Visitors Are Also Reading