Home » అన్నగారు చివరి రోజుల్లో “నా అసలైన వారసుడివి నువ్వేరా” అని ఎందుకు చెప్పారంటే ?

అన్నగారు చివరి రోజుల్లో “నా అసలైన వారసుడివి నువ్వేరా” అని ఎందుకు చెప్పారంటే ?

by Bunty
Ad

నందమూరి కుటుంబం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అలనాటి సీనియర్ నటుడు నందమూరి తారకరామారావు వంశం నుంచి తెలుగు చిత్ర పరిశ్రమకు చాలామంది నటీనటులు పరిచయమయ్యారు. అందులో హరికృష్ణ, బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్ మరియు కళ్యాణ్ రామ్ మాత్రమే బాగా సక్సెస్ అయ్యారు. ఇక వీరందరిలో కల్లా జూనియర్ ఎన్టీఆర్ కు మాత్రం ఫాలోయింగ్ బాగా ఎక్కువ. అచ్చం అలనాటి సీనియర్ నటుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు లాగే జూనియర్ ఎన్టీఆర్ కనిపిస్తారు. దీంతో జూనియర్ ఎన్టీఆర్ కు ఫాలోయింగ్ విపరీతంగా పెరిగిపోయింది.

Advertisement

అయితే.. గత కొంతకాలంగా జూనియర్ ఎన్టీఆర్ మరియు నందమూరి కుటుంబానికి, తెలుగుదేశం పార్టీకి గ్యాప్ వచ్చింది. మన ఎన్టీఆర్ శ్రద్ధ జయంతి వేడుకలకు కూడా జూనియర్ ఎన్టీఆర్ వెళ్లలేదు. దీనికి చంద్రబాబు నాయుడు కారణమని కొంతమంది అంటున్నారు. ఈ తరుణంలో అలనాటి సీనియర్ నటుడు నందమూరి తారక రామారావు చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ గా మారాయి. తన చిన్నతనంలో నందమూరి తారక రామారావు దగ్గరికి జూనియర్ ఎన్టీఆర్ వెళ్ళాడట. ఆ సమయంలో… నీ పేరు ఏంటి అని జూనియర్ ఎన్టీఆర్ను సీనియర్ నటుడు నందమూరి తారక రామారావు అడిగారట.

Advertisement

దానికి సమాధానంగా… తన పేరు తారక రామ్ అని చెప్పారట జూనియర్ ఎన్టీఆర్. ఈ తరుణంలోనే వెంటనే హరికృష్ణ పిలిచి… తారక రామ్ అని పేరు ఎందుకు పెట్టావ్… అతని పేరు నందమూరి తారక రామారావు అని పెట్టు అని హరికృష్ణ ఆదేశించారట అలనాటి నందమూరి తారక రామారావు. దీంతో అప్పటి నుంచి.. ఎన్టీఆర్ గా తారక్ మారిపోయారు. జూనియర్ ఎన్టీఆర్ అచ్చం నాలాగే ఉన్నాడు… నా అంశ ఇతడిది.. నీ కొడుకును బాగా చూసుకోండి… నా పోలికలు ఉన్నాయి… బాగా ఎదుగుతాడు అని హరికృష్ణ దంపతులకు సీనియర్ ఎన్టీఆర్ చెప్పారట. అయితే తెలుగుదేశం మరియు జూనియర్ ఎన్టీఆర్ మధ్య విభేదాల నేపథ్యంలో… ఈ విషయాన్ని వైరల్ చేస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్.

మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:

నటి మహేశ్వరికి…శ్రీదేవికి మధ్య ఉన్న సంబంధం ఏంటో తెలుసా….?

అఖిల్ ను ‘అయ్యగారు’ అని ఎందుకు పిలుస్తారు ?

చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ లా మల్టీ స్టారర్ మధ్యలోనే ఎందుకు ఆగిపోయిందంటే ?

Visitors Are Also Reading