Home » అర చేయి చూసి 60 ఏండ్ల ముందే ఎన్టీఆర్ భవిష్యత్తు చెప్పిన ఆ సినీ నటుడు..ఆయన చెప్పిందే జరిగిందా..?

అర చేయి చూసి 60 ఏండ్ల ముందే ఎన్టీఆర్ భవిష్యత్తు చెప్పిన ఆ సినీ నటుడు..ఆయన చెప్పిందే జరిగిందా..?

by Sravanthi
Ad

అది 1958వ సంవత్సరం.. లలిత శివజ్యోతి వారి లవకుశ అనే చిత్రం ప్రారంభోత్సవం జరిగింది. ఈ సినిమా ముహూర్తం షార్ట్ ఎన్టీఆర్ పై తీయాలని దర్శకుడు పుల్లయ్య గారు అనుకున్నారు. ఇక సినిమాలో నటించే నటీనటులు అందరూ ఆ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆ రోజు ముహూర్తం షాట్ మాత్రమే తీయబోతున్నారు.

Advertisement

ఇక మరుసటి రోజు నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది. ఎన్టీఆర్ కు తప్ప మిగిలిన వారు ఎవరికి మేకప్ లేదు. ఇంతలో స్టార్ట్ కెమెరా, యాక్షన్ అన్నారు పుల్లయ్య. శ్రీరాముని గెటప్ లో ఉన్న ఎన్టీఆర్ అలా నడుచుకుంటూ వచ్చారు. ఇంతలో డైరెక్టర్ కట్ అన్నారు. షార్ట్ బాగా పండింది.

ALSO READ:బ్రిట‌న్ రాజ‌వంశం రాజ‌కీయాల్లోకి రాక‌పోవ‌డానికి కార‌ణం అదేనా..?

Advertisement

అందరూ చప్పట్లు కొట్టారు. అక్కడే ఉన్నటువంటి అలనాటి ప్రముఖ హాస్యనటుడు రేలంగి వెంటనే వచ్చి రామారావును కౌగిలించుకున్నారు.ఏమి తేజస్సు, ఏమి తేజస్సు అంటూ గుడిలో దేవున్ని చూసిన అనుభూతి కలిగింది అంటూ మాట్లాడారు. నీవు సామాన్యుడివి,కాదు నీ చేయి చూపించమని అడిగాడు. హస్తసాముద్రికం తెలిసిన రేలంగి ఎన్టీఆర్ అరచేతిని చూస్తుండగా, అక్కడ ఉన్న వారు అందరూ ఆసక్తిగా తిలకించారు.

నీవు మహర్జాతకుడవు,నువ్వు ఏది పెట్టినా బంగారం, శుభం కలుగుతుందని చెప్పాడు. తిరుగులేని నటుడివి అవుతావు. పురాణపురుష పాత్రల్లో ఒదిగిపోయి పూజలు కూడా అనుకుంటావు. నీకు 50 సంవత్సరాలు వచ్చిన తర్వాత అద్భుతాలు జరుగుతాయి అంటూ, దేశమంతా నీ పేరు మార్మోగిపోతోంది, కానీ చివర్లో మాత్రం అంటూ ముగించారు రేలంగి. ఆ సమయంలో రేలంగి గారు ఎన్టీఆర్ చేయి పట్టుకొని చూసిన ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ALSO READ:రామ్ చరణ్ ఎంట్రీ సీన్ ఎన్టీఆర్ సినిమా నుండి ఎత్తేసారా..?

Visitors Are Also Reading