Home » ఎన్టీఆర్ వ‌ద్ద ఎన్ని కార్లు ఉన్నాయో తెలుసా…!

ఎన్టీఆర్ వ‌ద్ద ఎన్ని కార్లు ఉన్నాయో తెలుసా…!

by AJAY
Ad

నంద‌మూరి తార‌క‌రామారావు మ‌న‌వ‌డిగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన హీరో ఎన్టీఆర్. ప్ర‌స్తుతం వ‌రుస సినిమాలు చేస్తూ ఎన్టీఆర్ ఇండ‌స్ట్రీలో ఫుల్ బిజీగా మారిపోయాడు. ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఇప్ప‌టికే ఆర్ఆర్ఆర్ ప్ర‌మోష‌న్ల ద్వారా ఎన్టీఆర్ అన్ని భాష‌లు గ‌ల‌గ‌లా మాట్లాడుతూ దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. సింహాద్రి సినిమాతో రికార్డులు బ్రేక్ చేశాడు.

NTR

NTR

ఆ త‌ర‌వాత కొన్ని సినిమాలు చేసినా ఆశించిన మేర విజ‌యం సాధించ‌లేక‌పోయాయి. మ‌ళ్లీ పూరిజ‌గ‌న్నాత్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన టెంప‌ర్ సినిమాతో సూప‌ర్ డూపర్ హిట్ ను అందుకున్నాడు. ఇక టాలీవుడ్ లో స్టార్ హీరోగా ఉన్న ఎన్టీఆర్ రెమ్యున‌రేష‌న్ కూడా గ‌ట్టిగానే పుచ్చుకుంటారు. దాదాపు30 కోట్ల‌వ‌ర‌కూ ఎన్టీఆర్ రెమ్యున‌రేష‌న్ ఉంటుంద‌ని టాలీవుడ్ టాక్.

Advertisement

Advertisement

ntr

దాంతో ఎన్టీఆర్ ల‌గ్జ‌రీ లైఫ్ ను అనుభివిస్తున్నాడు. ఎన్టీఆర్ కార్ల‌ను ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డ‌తార‌ని తెలుస్తోంది. ఇటీవ‌ల ఎన్టీఆర్ ఇటీవ‌లే లంబోర్గిని కారును కొనుగోలు చేశారు. ఈ కారుతో పాటూ బెంజ్ కార్ కూడా ఉంది. అదే విధంగా రేంజ్ రోవ‌ర్ కారు కూడా ఉంది. బీఎం డ‌బ్ల్యూ కారు కూడా ఉంది.

ntr

ఇక మొత్తం ఎన్టీఆర్ కు ఐదు వంద‌ల కోట్ల వ‌ర‌కూ ఉంటుందని తెలుస్తోంది. కార్ల‌తో పాటూ ల‌క్ష‌ల విలువ చేసే వాచ్ ల‌ను ఎన్టీఆర్ కొనుగోలు చేస్తార‌ని ఆయ‌న స‌న్నిహితులు చెబుతుంటారు. కార్తికేయ పెళ్లికి వ‌చ్చిన ఎన్టీఆర్ రెండు కోట్ల విలువ చేసే వాచ్ ను ధ‌రించి అంద‌ర్నీ ఆశ్చ‌ర్యప‌ర్చాడు. ఇక ఎంతో ల‌గ్జ‌రీ జీవితాన్ని అనుభ‌వించే ఎన్టీఆర్ యాబై కోట్ల విలువ చేసే ఇంట్లో ఉంటున్నారు. ఈ ఇల్లు హైద‌రాబాద్ లోనే ఉంది.

Visitors Are Also Reading