Home » NTR : అన్‌ స్టాపబుల్‌ షోకు ఎన్టీఆర్‌

NTR : అన్‌ స్టాపబుల్‌ షోకు ఎన్టీఆర్‌

by Bunty
Ad

బాలకృష్ణ హోస్ట్‌ చేస్తున్న అన్‌స్టాపబుల్‌ షోకు ప్రేక్షకుల నుంచి అనుకున్న దానికంటే ఎక్కువ ఆదరణ వస్తోంది. దీంతో నిర్వాహకులు కొత్త కొత్త గెస్ట్‌లను షోకు ఆహ్వానించే కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఇది ఆహా ఓటీటీ ఫ్లాట్‌ ఫాంలో స్ట్రీమింగ్‌ అవుతుంది. ఈ షోకు నిర్మాత అల్లుఅరవింద్‌ డిజైన్‌ చేశారని అందరికి తెల్సిన విషయమే … దీన్లో భాగంగానే బాలకృష్ణ అఖండ ప్రీ రీలీజ్‌ ఈవెంట్‌కు బన్నీ గెస్ట్‌గా వచ్చారు. కాగా ఇప్పటికే ఈ షోకు సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు ఈ వస్తారనే విషయాన్ని షో నిర్వాహకులు ద్రువీకరించారు.

Advertisement

Advertisement

తాజాగా ఈ షోకు మరో యంగ్‌ హిరో జూనియర్‌ ఎన్టీఆర్‌ సైతం వస్తున్నాడనే ప్రచారం జరుగుతోంది. దీనిపై ఎన్టీఆర్‌ సానుకూలంగా స్పందించారాని సమాచారం. బాబాయ్‌-అబ్బాయ్‌ ఒకే వేదిక మీద అభిమానులను కనువిందు చేయడం ఖాయంగా కనిపిస్తుంది. కాగా ప్రస్తుతం ఎన్టీఆర్‌ రాజమౌళి తెరక్కిస్తున్న ఆర్ఆర్‌ఆర్‌ మూవీలో బీజీగా ఉన్నారు. ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాల్సి ఉన్నా ఒమిక్రాన్‌ వేరింయట్‌ కారణంగా వాయిదా పడే అవకాశం ఉందని ప్రొడ్యూసర్స్‌ చెబుతున్నారు.

ఇప్పటికే బాలకృష్ణ అఖండ మంచి సక్సెస్‌తో దూసుకెళ్తుండటంతో పెద్ద సినిమాలకు లైన్‌ క్లియర్‌ అయిందనే అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో పెద్ద సినిమాలు వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి.

Visitors Are Also Reading