Home » కొత్త ట్రెండ్‌… సీనియర్ హీరో చిత్రాల ఈవెంట్ల‌కు యంగ్ హీరోలు..

కొత్త ట్రెండ్‌… సీనియర్ హీరో చిత్రాల ఈవెంట్ల‌కు యంగ్ హీరోలు..

by Bunty
Ad

కొన్ని కాంబినేష‌న్లు చాలా విచిత్రంగా ఉంటాయి. ఆ కాంబినేష‌న్ల‌లో సినిమాలు ప‌క్క‌న పెడితే, వారి క‌లిసి వేదిక పంచుకుంటే చూడాల‌ని ఉంటుంద‌ని చాలా మంది అనుకుంటుంటారు. అలాంటి వాటిల్లో నంద‌మూరి బాల‌కృష్ణ‌, అల్లు అర‌వింద్ ఒక‌రు. ఇప్ప‌టి వ‌ర‌కు నిర్మాత అల్లు అర‌వింద్ నిర్మాణ సారథ్యంలో ఒక్క సినిమాలో కూడా బాల‌య్య యాక్ట్ చేయ‌లేదు. అయితే, అల్లు అర‌వింద్‌, బాల‌య్య మ‌ధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. కానీ, వాటిని ముందుకు తీసుకెళ్ల‌లేక‌పోయారు. ఆ ప‌నిని ఇప్పుడున్న యంగ్ హీరోలు చేసి చూపించారు. అల్లు అర్జున్‌, జూనియ‌ర్ ఎన్టీఆర్ మ‌ధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. ఇవే బాల‌య్య చేత ఆహా చేయించేలా చేశాయి. బాల‌య్య ఆహాలో చేస్తున్న సీరిస్ సూప‌ర్ హిట్ కావ‌డంతో బాల‌య్య అఖండ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌కు బన్నీ వ‌చ్చేలా చేశాయి. బాల‌య్య అభిమానుల‌తో పాటుగా బ‌న్నీ అభిమానులు కూడా అఖండ విజ‌యాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. త్వ‌ర‌లోనే పుష్ప ప్రీరిలీజ్ ఈవెంట్ ఉన్న‌ది. ఈ ఈవెంట్‌కు బాల‌య్య వ‌స్తార‌నే వార్త‌లు వ‌స్తున్నాయి.

Advertisement

Advertisement

ఇక ఇదిలా ఉంటే, మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమా షూటింగ్ వేగంగా జ‌రుగుతున్న‌ది. ఆచార్య సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఇప్ప‌టి నుంచే ప్లాన్ చేస్తున్నారు. ఆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు జూనియ‌ర్ ఎన్టీఆర్‌ను పిలుస్తార‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. జూనియ‌ర్-రామ్ చ‌ర‌ణ్ లు ఇండ‌స్ట్రీలో మంచి ఫ్రెండ్స్‌. ఈ సంగ‌తి అంద‌రికీ తెలిసిందే. ఇద్ద‌రూ క‌లిసి ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా కోస‌మే ఆచార్య రిలీజ్‌ను పోస్ట్ పోన్ చేసుకున్నారు. దీంతో ఎన్టీఆర్ ఆచార్య సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌కు త‌ప్ప‌ని స‌రిగా హాజ‌ర‌వుతార‌ని ఫిలింన‌గ‌ర్‌లో గుస‌గులు వినిపిస్తున్నాయి. సీనియ‌ర్ హీరోల సినిమాల‌కు యువ‌హీరోలు హాజ‌రుకావడం అంటే కొత్త ట్రెండ్‌కు బాట‌లు వేసిన‌ట్టే క‌దా.

Visitors Are Also Reading