నటసింహం నందమూరి బాలకృష్ణ కెరీర్ లోని బ్లాక్ బస్టర్ సినిమాలలో నరసింహనాయుడు సినిమా ఒకటి. 2001 సంవత్సరంలో సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా టాలీవుడ్ లో మొట్టమొదటి 20 కోట్ల రూపాయల సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. ఫుల్ రన్ లో 22 కోట్ల రూపాయలకు పైగా షేర్లను వసూలు చేసి బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచింది.
Advertisement
అంతేకాకుండా 95 కు పైగా సెంటర్లలో నేరుగా 100 రోజులు ఆడింది. ఇప్పటికీ ఈ సినిమా టీవీలో వస్తే మిస్ కాకుండా చూసే ప్రేక్షకులు ఉన్నారు. బాలయ్య ఫ్యాన్స్ కి అయితే ఈ సినిమా అంటే చాలా ఇష్టం. అయితే ఈ సినిమాను బాలయ్య పుట్టినరోజు సందర్భంగా ఈనెల 10వ తేదీన తెలుగు రాష్ట్రాలలో విడుదల చేయబోతున్నారు.
Advertisement
ఇప్పటికే సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్ అన్ని ప్రాంతాలలో షురూ అయ్యాయి. కానీ అడ్వాన్స్ బుకింగ్స్ ట్రేడ్ ఆశించిన స్థాయిలో కనిపించడం లేదు. గతేడాది బాలయ్య పుట్టినరోజుకు చెన్నకేశవరెడ్డి సినిమాను రీ రిలీజ్ చేశారు. అయితే చెన్నకేశవరెడ్డి సుమారుగా కోటి 42 లక్షల రూపాయల గ్రాస్ ను వసూలు చేసింది. కానీ ఈ ఏడాది విడుదల చేస్తున్న నరసింహనాయుడు అడ్వాన్స్ బుకింగ్ లు మాత్రం వీక్ గా కనిపిస్తున్నాయి. దాంతో ఇంత వీక్ గా ఉండటానికి కారణం ఏంటి అని ట్రేడ్ నిపుణులు ఆశ్చర్యపోతున్నారు. అయితే దీనికి ఒక కారణం ఉంది.
ఎన్టీఆర్ శత దినోత్సవ వేడుకలకు జూనియర్ ఎన్టీఆర్ గైహాజరు అయినప్పటి నుండి బాలయ్య ఎన్టీఆర్ ఫ్యాన్స్ మధ్య గొడవలు మొదలయ్యాయి. ట్విట్టర్ లో స్పేస్ పెట్టి మరి బాబాయి అబ్బాయి ఫ్యాన్స్ తిట్టుకున్నారు. అంతేకాకుండా బాలయ్య ఫ్యాన్స్ ఎన్టీఆర్ తల్లి పై ఘోరమైన ఆరోపణలు చేశారు. అందువల్లే బాలయ్య సినిమాలను ఎన్టీఆర్ అభిమానులు చూడమని చెప్పారు. ఎన్టీఆర్ అభిమానులు చెన్నకేశవరెడ్డికి దూరంగా ఉండటం వల్లనే బుకింగ్స్ తక్కువ అయ్యాయి అని విశేషకులు అభిప్రాయపడుతున్నారు.