ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి అంటుంటారు. ఈ సామెత వచ్చింది పెళ్లి గురించే. సరైన వయసులో పెళ్లి చేసుకోవాలి అని చెప్పేందుకే ఈ సామెతను వాడుతుంటారు. అయితే ఒకప్పుడు చిన్న వయసులో మేజర్ అవ్వకముందే అంటే అమ్మాయికి 18 ఏళ్లు నిండకుండానే అబ్బాయికి 21 ఏళ్లు నిండకుండానే పెళ్లి చేసేవారు.
Ad
అలా చేయడంవల్ల మానసికంగా శారీరకంగా ఎదగకుండానే పెళ్లిళ్లు జరిగేవి. దాంతో అనారోగ్య సమస్యలు కూడా వచ్చేవి. అమ్మాయిలు చిన్న వయసు లో పెళ్లి చేసుకుని పిల్లలను కనడం వల్ల అనారోగ్య సమస్యలతో బాధపడేవారు. ఆ తర్వాత జనాల్లో మార్పు వచ్చింది. అమ్మాయి అబ్బాయి ఇద్దరు మేజర్ అయిన తర్వాతనే పెళ్లిళ్లు చేయడం ప్రారంభించారు. కొన్ని ఏళ్ళ పాటు అలా కొనసాగింది. అయితే ఇప్పుడు మాత్రం లేటు వయసులో పెళ్లిళ్లు జరుగుతున్నాయి.
మగవారికి 30 ఏళ్లు దాటిన తర్వాత ఆడవారికి 25 ఏళ్లు దాటిన తర్వాత పెళ్లిళ్లు చేస్తున్నారు. దాంతో శృంగారపరమైన హార్మోన్లు తగ్గిపోయి శృంగార జీవితం మీద పెద్దగా ఆసక్తి ఉండదని నిపుణులు చెబుతున్నారు. మగవారికి 22 నుండి 26 సంవత్సరాల లోపు పెళ్లి చేయాలని అంటున్నారు. ఆ వయసులో మగవారిలో శుక్ర కణాల సంఖ్య ఎక్కువగా ఉండి వెంటనే సంతానం కలుగుతుందని చెబుతున్నారు. అంతేకాకుండా అమ్మాయిలకు అయితే 18 నుండి 22 సంవత్సరాల లోపు పెళ్లి చేయడం మంచిదని చెబుతున్నారు. ఆ వయసులో అండాల ఉత్పత్తి ఎక్కువగా ఉంటుందని సంతాన సమస్యలు రావని అంటున్నారు. ఆడవారికి 19 నుండి 24 ఏళ్ల వయసులో గర్భం దాల్చడానికి అన్ని వయసులకన్నా సురక్షితంగా ఉంటుందని చెబుతున్నారు.
29 ఏళ్ల వరకు గర్భం దాల్చడం అనేది పర్వాలేదు కానీ 30 ఏళ్లు దాటిన తర్వాత మాత్రం ప్రమాదమేనని హెచ్చరిస్తున్నారు. 30 ఏళ్ల తర్వాత మగవారికి 20 ఏళ్ల తర్వాత ఆడవారికి పెళ్లి చేస్తే వారిలో శుక్రకణాల సామర్థ్యం తగ్గిపోయి శృంగారంపై ఆసక్తి ఉండదని అంటున్నారు. ఎన్నో జంటలపై పరిశోధనలు జరిపిన నిపుణులు ఈ విషయాలను చెబుతున్నారు. ఏజ్ పెరగడం మరోవైపు స్ట్రెస్ కారణాల వల్ల పిల్లలు పుట్టడం లేదని కాబట్టి సరైన వయసులోనే పెళ్లిళ్లు చేసుకుని పిల్లలను కనాలని చెబుతున్నారు.