ఎన్నో అంచనాల మధ్య తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమా మార్చి 25న థియేటర్లలో విడుదలైంది. ఊహించినట్టుగానే ఈ సినిమా మొదటి రోజే వందల కోట్ల కలెక్షన్ లను రాబట్టింది. అంతే కాకుండా సర్వత్రా సినిమాకు పాజిటివ్ టాక్ వస్తోంది. అయితే కొంతమంది మాత్రం సినిమాకు కావాలనే నెగిటివ్ ప్రచారం కూడా చేస్తోన్న సంగతి తెలిసిందే. సినిమా చూడకముందే కొంతమంది తమిళ హీరోల అభిమానులు సోషల్ మీడియాలో సినిమాపై నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు.
అంతే కాకుండా బాలీవుడ్ ప్రేక్షకులు కూడా సినిమా బాగుందని చెబుతుంటే ఓ బాలీవుడ్ విశ్లేషకుడు మాత్రం సినిమా బాగోలేదని రాజమౌళికి శిక్షవేయాలంటూ ట్వీట్ చేశాడు. దాంతో నెటిజన్లు అతడిపై ఫైర్ అయ్యారు. మరోవైపు టాలీవుడ్ లోని కొందరు ఇతర హీరోల అభిమానులు కూడా సినిమాకు నెగిటివ్ ప్రచారం చేయడం చేదు నిజం. ఇదిలా ఉంటే సినిమాలో ఎన్టీఆర్ రామ్ చరణ్ ల నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతున్న సంగతి తెలిసిందే.
Advertisement
Advertisement
Also Read: బ్లాక్ బస్టర్ “ఇంద్ర” సినిమాలో ఈ మిస్టేక్ ను గమనించారా…!
అయితే సినిమా చూసిన కొంతమంది ఎన్టీఆర్ అభిమానులు మాత్రం నిరుత్సాహపడుతున్నారు. సినిమాలో రామ్ చరణ్ పాత్ర డామినేట్ చేస్తుందని కామెంట్లు చేస్తున్నారు.ఆర్ఆర్ఆర్ సినిమాలో చరణ్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని ఎన్టీఆర్ లాంటి నటుడిని సరిగ్గా వాడుకోలేదని ఓ అభిమాని థియేటర్ ముందు కామెంట్లు చేశాడు.
ఎన్టీఆర్ కు పది నిమిషాలు మాత్రమే స్కోప్ ఉందని ఎన్టీఆర్ సమయాన్ని వృధా చేశారని మండిపడ్డాడు. ఇదిలా ఉండగా సినిమాను ఇద్దరు హీరోల మధ్య పోటీలా చూడకూడదని విశ్లేషకులు చెబుతున్నారు. అంతేకాకుండా సినిమాలో ఏ ఒక్కరి పాత్రకు ప్రాముఖ్యత తగ్గలేదని ఇద్దరినీ సమానంగా వాడుకున్నారని అంటున్నారు. కథ ప్రకారంగా చరణ్ కు కాస్త నటించే అవకాశం ఎక్కువగా వచ్చిందని అంటున్నారు.
Also Read: మీరు తీయగలరు మేం చూడగలం అంతే…జక్కన్న పై సుకుమార్ ప్రశంసల వర్షం..!