ప్రస్తుతం దేశవ్యాప్తంగా సినీప్రియులు ఎదురుచూస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. ఈ సినిమాకు రాజమౌళి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ చరణ్ లు హీరోలుగా నటించగా విజయేంద్రప్రసాద్ ఈ చిత్రానికి కథను అందించారు. అంతే కాకుండా సినిమాలో రాచ్ చరణ్ కు జోడీగా అలియాభట్ నటించగా ఎన్టీఆర్ కు జోడీగా ఒలివియా మోరీస్ నటించారు. మరోవైపు అజయ్ దేవ్ గన్ మరియు శ్రీయలు కూడా ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రల్లో నటించారు.
Advertisement
ఇదిలా ఉంటే ఈ సినిమా మార్చి 25న విడుదలకు సిద్దంగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా సంక్రాంతికి విడుదల కావాల్సి ఉండగా సినిమా సెన్సార్ ను పూర్తిచేసుకున్నట్టు చిత్రయూనిట్ గతంలో ప్రకటించింది. దాని ప్రకారంగా సినిమా నిడివి మూడు గంటల ఆరు నిమిషాల యాభై నాలుగు సెకన్లు ఉంది.
Also Read: పెళ్లి చేసుకోకుండానే పిల్లలకు జన్మనిచ్చిన సెలబ్రెటీలు వీళ్లే..!
Advertisement
అయితే తాజాగా వెల్లడించిన సెన్సార్ వివరాల ప్రకారంగా….సినిమా నిడివిని మూడు గంటల రెండు నిమిషాలకు కుదించారు. అంటే సినిమా నిడివి ఐదు నిమిషాల ఒక సెకన్ తగ్గింది. ఇక డిలీట్ చేసిన సన్నివేశాల విషయానికి వస్తే….ఎన్టీఆర్ చేసిన కొమురంభీం పాత్ర గొప్పతనాన్ని చెప్పే డైలాగును సినిమాలో కట్ చేశారట.
అంతే కాకుండా థాంక్స్ కార్డులో 20 సెకన్ల సీన్ ను కట్ చేశారట. సినిమా పూర్తయిన తరవాత విజువల్ ఎండ్ క్రెడిట్స్ లో కూడా 3.05 నిమిషాల విజువల్స్ ను కూడా కత్తిరించారట. ఒకసారి సెన్సార్ పూర్తయిన తరవాత సినిమాలో సీన్లను పెంచాలన్నా లేదా తగ్గించాలన్నా కూడా సెన్సార్ కు ఇన్ఫామ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి సినిమాలో కత్తిరించిన సీన్ల వివరాలు బయటకు వచ్చాయి. అయితే ఎన్టీఆర్ పాత్ర సీన్ ను కట్ చేయడం వల్ల ఇప్పుడు అభిమానులు అందోళనలో ఉన్నారు.
Also Read: విశ్వనాథ్ అంటే శంకరాభరణమే కాదు క్రైమ్ థ్రిల్లర్ లు కూడా ఉన్నాయన్న సంగతి తెలుసా…!