Home » ఎన్టీఆర్ సాధించిన ఈ రికార్డు.. తెలుగులో ఏ హీరో బీట్ చేయడం అసాధ్యం..!

ఎన్టీఆర్ సాధించిన ఈ రికార్డు.. తెలుగులో ఏ హీరో బీట్ చేయడం అసాధ్యం..!

by Sravanthi
Ad

ఎన్టీఆర్ పేరంటే ఒక చరిత్ర ఆయన తన లైఫ్ స్పాన్ లో దాదాపు 300 సినిమాలు చేశారు. అందులో ఎక్కువ టైటిల్ రోల్స్ చేసిన మూవీస్ ఏ ఉన్నాయి. ఎన్టీఆర్ 44 ఏళ్ల సినీ కెరీర్లు 48 పౌరాణిక సినిమాలు చేశారు. 18 చారిత్రక సినిమాలు 55 జానపద సినిమాల్లో నటించారు. 186 సోషల్ సబ్జెక్ట్ మూవీస్ చేశారు. అప్పట్లో పాన్ ఇండియా లెవెల్లో హిందీలో చండీరాణి మూవీ చేశారు అంతే కాకుండా నయా ఆదేమీ అనే సినిమాలో కూడా నటించారు ఈ మూవీ తెలుగులో సంతోషం పేరుతో వచ్చింది. హీరోగా ఎన్టీఆర్ పనైపోయింది అనుకున్న వాళ్లకు 1977లో తన సినిమాతో గట్టిగా సమాధానం చెప్పారు.

Advertisement

ఆ ఏడాది జనవరి 14న స్వీయ దర్శకత్వంలో దానవీరశూరకర్ణ సినిమా తెరకెక్కింది ఇండస్ట్రీలో పెద్ద హిట్ అయింది. ఏప్రిల్ 28న అదే ఏడాదికి ఏ రాఘవేంద్రరావు దర్శకత్వంలో మొట్టమొదటిసారి ఎన్టీఆర్ నటించిన అడవి రాముడు మూవీ ఇండస్ట్రీలో కమర్షియల్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది. అంతేకాకుండా పెద్ద హిట్ అయింది.

Advertisement

Also read:

Also read:

1977 అక్టోబర్ 21న వచ్చిన యమగోల సినిమా మూడవ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది ఇండస్ట్రీని షేక్ చేసిన సినిమాలు అరుదుగా వస్తూ ఉంటాయి. అలాంటిది ఒకే ఏడాది మూడు సినిమాలు ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయి పైగా మూడు కూడా ఇండస్ట్రీలో పెద్ద హీట్స్ అయ్యాయి 1977లో ఎన్టీఆర్ ఈ మూడు ఇండస్ట్రీ హిట్స్ తో పాటుగా చాణక్యచంద్రగుప్త, ఎదురీత, ఈ ఇద్దరి కథ వంటి సినిమాల్లో కూడా నటించారు ఈ సినిమాలు కూడా ఓ మోస్తరు విజయాలను అందుకున్నాయి.

తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

 

Visitors Are Also Reading