Home » కేక పుట్టించే క్రేజీ కాంబో రిపీటవుతోందా..ఎన్టీఆర్ తో జతకట్టనున్న అందాల తార..!!

కేక పుట్టించే క్రేజీ కాంబో రిపీటవుతోందా..ఎన్టీఆర్ తో జతకట్టనున్న అందాల తార..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

ఆమె ఓ న్యాచురల్ బ్యూటీ. మేకప్ లేకుండా ఆరోజుల్లోనే తెరపై కనిపించి ఎంతోమంది అభిమానులనుసొంతం చేసుకుంది. ఏ పాత్రలో చేసినా తనకు తానే సాటి.. అనుకోకుండా ఎన్టీఆర్ తో జత కట్టి ఇప్పటికే బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టింది. అంతటి నటనా చాతుర్యం,అందం ఉన్న బ్యూటీ ఎన్టీఆర్ తో మళ్ళీ కనబడబోతోంది అంటే ఫ్యాన్స్ ఎంతో ఆనంద పడుతున్నారు.. ఆ ముద్దుగుమ్మ ఎవరంటే ఆవిడే భూమిక.. సింహాద్రి సినిమాలో ఎన్టీఆర్ తో జత కట్టి అందరినీ మెస్మరైజ్ చేసింది.

Advertisement

వీరి కాంబో లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బ్లాస్టర్ హిట్ అయింది. ఇన్నేళ్ల కెరీర్లో ఎప్పుడు కూడా హద్దులు దాటకుండా మెయింటైన్ చేసిన ఈ బ్యూటీ మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసేందుకు కాస్త గ్లామర్ బయటకు తీసుకు వస్తోంది. దీంతో మళ్లీ అవకాశాలను అందుకుంటోంది. అయితే తారక్ కొరటాల శివ కాంబినేషన్లో ఒక సినిమా వస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ మూవీలో ఎన్టీఆర్ ను కొత్త లుక్ లో చూపించబోతున్నట్లు సమాచారం.

Advertisement

 

అయితే ఈ సినిమాలో ఈ అందాల ముద్దుగుమ్మ ఒక ఇంపార్టెంట్ పాత్రలో కనిపిస్తుందని తెలుస్తోంది. తారక్ మరియు భూమికలను తెరపై చూసి చాలా సంవత్సరాలు అయింది. వీరి కాంబోలో మళ్లీ సినిమా కోసం అభిమానులు చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు. ఇలాంటి సమయంలోనే కొరటాల శివ తీసుకున్న నిర్ణయం ఈ సినిమా పై మరింత హైప్ తీసుకు వచ్చింది. అయితే దీనిపై అధికారిక ప్రకటన త్వరలోనే రాబోతున్నట్లు తెలుస్తోంది.

ALSO READ:

Visitors Are Also Reading