Home » బాలయ్య పెళ్లికి రానని చెప్పిన ఎన్టీఆర్… కారణం ఏంటో తెలుసా…!

బాలయ్య పెళ్లికి రానని చెప్పిన ఎన్టీఆర్… కారణం ఏంటో తెలుసా…!

by AJAY
Ad

తెలుగు చిత్ర పరిశ్రమలో నందమూరి తారక రామారావు చెరగని ముద్ర వేసుకున్నారు. అన్నగారు అని ప్రతి ఒక్కరు పిలుచుకునే స్థాయికి ఎన్టీఆర్ ఎదిగారు. టాలీవుడ్ లో స్టార్ హీరో రేంజ్ కు ఎదిగిన ఎన్టీఆర్ తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించి అక్కడ కూడా సత్తా చాటారు. ముఖ్యమంత్రి కుర్చీ పై కూర్చుని ఎన్నో పథకాల ద్వారా ప్రజలను ఆకర్షించారు ప్రజా సేవ చేశారు. ఇదిలా ఉంటే కొంతకాలం క్రితం ఎన్టీఆర్ బయోపిక్ లు వచ్చిన సంగతి తెలిసిందే. వాటిలో బాలకృష్ణ తీసిన కథానాయకుడు, మహానాయకుడు సినిమాలు కూడా ఉన్నాయి. అయితే ఈ సినిమాలో నాదెండ్ల భాస్కర్ రావు ను విలన్ గా చూపించారు.

ALSO READ : RADHESHYAM : రాధేశ్యామ్ వాలెంటైన్స్ డే స్పెషల్ గ్లింప్స్ వ‌చ్చేసింది..!

Advertisement

కాగా మీడియా ముందుకు వచ్చిన నాదెండ్ల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ గురించి చెబుతూ ఆయన అంత గొప్పవాడు ఇంత గొప్పవాడు అని మనం అనుకుంటాం కానీ సొంత కొడుకు పెళ్లికి రాలేకపోయార‌ని కామెంట్ చేశాడు. ఎన్టీఆర్ కు నాదెండ్ల సన్నిహితుడు కావడంతో బాలకృష్ణ చెన్నైలో ఎవరినో ప్రేమిస్తున్నారంట‌… ఎవరితోనో తిరుగుతున్నారు అంట నాకు తెలిసింది అని చెప్పి ఎలాగైనా బాలకృష్ణకు మనం పెళ్లి చేయాలని ఎన్టీఆర్ తో చెప్పానని అన్నారు.

Advertisement

అంతే కాకుండా కాకినాడకు చెందిన నాదెండ్ల బంధువుల అమ్మాయి అయినే చూశానని చెప్పారు. మొదట సంబంధానికి ఎన్టీఆర్ ఒప్పుకోలేదని ఆ తర్వాత వసుంధర ఫ్యామిలీ ఎన్టీఆర్ కు 10 లక్షల కట్నం ఇవ్వడం తో పెళ్లికి ఒప్పుకున్నారు అని అన్నారు. అయితే బాలకృష్ణ పెళ్లిరోజు నాదెండ్ల ఎన్టీఆర్ ఇద్దరు కలిసి ఒక మీటింగ్ లో ఉన్నట్టు తెలిపారు. అయితే అక్కడి నుండి వెళ్ళిపోతే ప్రజల్లో తనకు చెడ్డపేరు వస్తుందేమోనని ఎన్టీఆర్ తో చెప్పారట. ఇప్పుడు పెళ్లి కి వెళ్లడం లేదని ఇక్కడే ఉంటున్నాను అని అన్నారట.

అంతేకాకుండా ఎన్టీఆర్ కావాలనే పెళ్లికి రాలేదు అని ఎన్టీఆర్ ప్రజా సేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చారని జనాలు అనుకోవాలని అలా చేశారని నాదెండ్ల వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ బాలకృష్ణ పెళ్లి కి రాకపోవడం అప్పట్లో సంచలనం రేపిందని చెప్పారు. అంతే కాకుండా సీనియర్ ఎన్టీఆర్ ఏది చేసినా జనాలను ఆకర్షించేలా చేయాలని ముందే అనుకుని అన్ని పనులు చేసేవారు అంటూ సంచలన ఆరోపణలు చేశారు.

Visitors Are Also Reading