Home » విడాకుల త‌ర‌వాత ప్ర‌శాంతంగా ప‌డుకున్నా..నోయ‌ల్ పై మాజీ భార్య ఫైర్..!

విడాకుల త‌ర‌వాత ప్ర‌శాంతంగా ప‌డుకున్నా..నోయ‌ల్ పై మాజీ భార్య ఫైర్..!

by AJAY
Ad

సినిమా ఇండ‌స్ట్రీలో పెళ్లిల్లు విడాకులు చాలా కామ‌న్. అయితే పెళ్లి చేసుకున్నాక‌ కొన్నేళ్ల పాటూ మాత్రం బాగానే క‌లిసి మెలిసి ఉంటారు. అయితే టాలీవుడ్ రాప‌ర్ న‌టుడు నోయ‌ల్ హీరోయిన్ ఎస్తేర్ పెళ్లైన ఎనిమిది నెల‌ల‌కే విడాకులు తీసుకున్న సంగ‌తి తెలిసిందే. నిజానికి వీరు పెళ్లైన ఐదు నెల‌ల‌కే విడాకుల‌కు అప్లై చేయ‌డం అప్ప‌ట్లో క‌ల‌క‌లం రేపింది. ఇక వీరిద్ద‌రూ అంత తొంద‌ర‌గా విడిపోవడానికి అస‌లు కార‌ణం ఏంటి అన్న ప్ర‌శ్న చాలా మందికి వ‌చ్చింది.

ALSO READ : ఆ తెలుగు హీరోయిన్ తో ప్రేమ వ‌ల్ల కెరీర్ నాశ‌నం చేసుకున్న బ‌ప్పీ ల‌హ‌రి..!

Advertisement

కానీ గ‌త ఇంట‌ర్వ్యూల‌లో నోయల్ కానీ ఎస్తేర్ కానీ త‌మ విడాకుల‌కు స్ప‌ష్ట‌మైన కార‌ణం చెప్ప‌లేదు. ఇక ప్ర‌స్తుతం ఇద్ద‌రూ వారి వారి సినిమాల‌తో బిజీ అయ్యారు. ఎస్తేర్ రీసెంట్ గా 69 సంస్కార్ కాల‌నీ అనే సినిమాలో న‌టించింది. ఈ సినిమాకు సంబంధించిన ప్ర‌మోష‌న్స్ లో ఓ ఇంట‌ర్వ్యూకు వెళ్లిన ఎస్తేర్ త‌మ విడాకుల‌పై ఆసక్తిక‌ర వ్యాక్య‌లు చేసింది.

Advertisement

నిజానికి తాను అప్ప‌టికి పెళ్లికి పూర్తి సిద్దంగా లేనని నోయ‌ల్ పెళ్లి చేసుకుంటే అన్నీ సెట్ అవుతాయ‌ని చెప్పాడ‌ని తెలిపింది. అంతే కాకుండా విడాకులు అనేవి ఒక్క రీజ‌న్ వ‌ల్ల కావ‌ని చెప్పింది. మొద‌ట్లో రిలేష‌న్ షిప్ వ‌ర్కౌట్ కాక‌పోయినా స‌ర్దుకుపోయాన‌ని..ఒక్క కార‌ణంతోనే విడిపోలేమని సర్దుకు పోయాన‌ని చెప్పారు. చాలా అవ‌కాశాలు ఇచ్చాన‌ని చెప్పింది.

ఓ రేంజ్ వ‌ర‌కూ చూసి ఆ త‌ర‌వాత విడాకులు తీసుకోవాల‌ని నిర్ణయించుకున్న‌ట్టు తెలిపింది. బిగ్ బాస్ లో మంచిగా క‌నిపించార‌ని యాంక‌ర్ చెప్ప‌గా…ఆయ‌న‌లో చాలా షేడ్స్ ఉన్నాయని అత‌డిని బ్లేమ్ చేయాల‌నుకోవ‌డం లేద‌ని చెప్పింది. వేరే వాళ్ల‌కు న‌చ్చ‌వ‌చ్చ‌ని త‌న‌కు మాత్రం న‌చ్చ‌లేద‌ని తెలిపింది. గొడ‌వ‌ల వ‌ల్ల విడిపోర‌ని కానీ క్యారెక్ట‌ర్ వ‌ల్ల‌నే విడిపోతార‌ని వ్యాఖ్యానించారు. అంతే కాకుండా విడాకులు తీసుకునేవ‌ర‌కూ చాలా స్ట్రెస్ గా ఉండేద‌ని విడాకులు వ‌చ్చిన రోజు రాత్రి చాలా ప్ర‌శాంతంగా నిద్ర‌పోయాన‌ని పేర్కొంది.

Visitors Are Also Reading