Home » ఆ తెలుగు హీరోయిన్ తో ప్రేమ వ‌ల్ల కెరీర్ నాశ‌నం చేసుకున్న బ‌ప్పీ ల‌హ‌రి..!

ఆ తెలుగు హీరోయిన్ తో ప్రేమ వ‌ల్ల కెరీర్ నాశ‌నం చేసుకున్న బ‌ప్పీ ల‌హ‌రి..!

by AJAY
Ad

ప్ర‌ముఖ సంగీత‌దర్శకుడు గాయ‌కుడు బ‌ప్పీ ల‌హ‌రి అనారోగ్యంతో ఫిబ్ర‌వ‌రి 16న క‌న్నుమూసిన సంగ‌తి తెలిసిందే. బ‌ప్పీ బాలీవుడ్ లో స్టార్ డైరెక్ట‌ర్ గా ఎదిగారు. బన్నీ గొంతెత్తి పాడినా శ్రోత‌లు చెవులు కోసుకునేవారు. బ‌ప్పీ త‌న జ‌న‌రేష‌న్ లో యువ సంగీత ద‌ర్శ‌కుడిగా సంచ‌ల‌నాలు సృష్టించాడు. అంతే కాకుండా లుక్ విష‌యంలో బప్పీ రూటే స‌ప‌రేటు…ఆయ‌నకు బంగారం అంటే చెప్ప‌లేనంత ఇష్టం దాంతో ఒంటినిండా బంగారం ధ‌రించి స్పెష‌ల్ అట్రాక్ష‌న్ గా నిలిచేవాడు.

ALSO READ : ప‌వన్ క‌ల్యాణ్ ఆస్తుల విలువ ఎంతో మీకు తెలుసా..?

Advertisement

ఇక బ‌ప్పీ బాలీవుడ్ లో సక్సెస్ అవ్వ‌డమే కాకుండా సూప‌ర్ స్టార్ కృష్ణ హీరోగా న‌టించిన సింహాస‌నం సినిమాకు స్వ‌రాలు స‌మ‌కూర్చారు. అయితే ఈ సినిమాకు బ‌ప్పీని తీసుకున్న‌ప్ప‌డు తెలుగు సినిమాకు హిందీ మ్యూజిక్ డైరెక్టరా అంటూ విమ‌ర్శ‌లు కురిపించారు. కానీ బ‌ప్పీ మాత్రం త‌న మ్యూజిక్ తో అలా అన్న‌వాళ్ల నోర్ల‌ను మూయించాడు. ఆ త‌ర‌వాత బ‌ప్పీ ల‌హ‌రి టాలీవుడ్ లో స్టార్ హీరోలుగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి, మోహ‌న్ బాబు, బాల‌కృష్ణ లాంటి వారి సినిమాల‌కు స్వ‌రాలు స‌మ‌కూర్చి టాలీవుడ్ లోనూ స‌త్తా చాటాడు.

Advertisement

bappi lahari

అయితే ఈ కాలంలో హీరోయిన్ లు హీరోల‌కు ద‌ర్శ‌కులకు ప‌డిపోవ‌డం చూస్తూనే ఉన్నాం. టాలీవుడ్ లో ఓ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ వెంట స్టార్ హీరోయిన్ ప‌డింది. ఎంతో ఇష్ట‌ప‌డింది. కానీ వారిద్ద‌రూ ఒక్క‌టవ్వ‌లేదు. ఇక త‌మిళ ప‌రిశ్ర‌మ‌లో ఓ కుర్ర‌మ్యూజిక్ డైరెక్ట‌ర్ స్టార్ హీరోయిన్ ల‌తో ఎంజాయ్ చేశాడు. దానికి సంబంధించిన ఫోటోలు కూడా అప్ప‌ట్లో వైర‌ల్ అయ్యాయి. అయితే సంగీత ద‌ర్శ‌కుల‌కు హీరోయిన్ లు ప‌డిపోవ‌డం ఇప్పుడే మొద‌లవ్వ‌లేదు.

బ‌ప్పీ ల‌హ‌రి సైతం టాలీవుడ్ కు చెందిన ఓ హీరోయిన్ తో ప్రేమ‌లో ప‌డ్డాడు. ఆ హీరోయిన్ అంటే బ‌ప్పీకి ఎంతో ఇష్ట‌మ‌నే రూమ‌ర్లు కూడా ఉన్నాయి. ఆ హీరోయిన్ కు కూడా బ‌ప్పీ అంటే ఎంతో ఇష్ట‌మ‌ట‌. ఇక ఆ హీరోయిన్ టాలీవుడ్ లో స‌క్సెస్ అయ్యి ఆ త‌రవాత బాలీవుడ్ కు మ‌కాం మార్చి అక్క‌డ కూడా సక్సెస్ అయ్యింది. ఆ హీరోయిన్ వ‌ల్ల బ‌ప్పీ కెరీర్ లో వెన‌క‌పడ్డాడ‌నే రూమ‌ర్స్ కూడా ఉన్నాయి.

Visitors Are Also Reading