Home » రోహిత్, ధావన్ మధ్య గొడవలు.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ..!

రోహిత్, ధావన్ మధ్య గొడవలు.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ..!

by Azhar
Ad

భారత జట్టుకు సీనియర్ ఓపెనర్లు గా కొనసాగుతున్న శిఖర్ ధావన్, రోహిత్ శర్మ. అయితే వీరిద్దరూ మొదటిసారి ఓపెనర్లుగా 2013 ఛాంపియన్స్ ట్రోఫీలో బరిలోకి దిగారు. అప్పుడు వీరి జోడి సూపర్ సక్సెస్ అయ్యింది. ఆ టోర్నీలో ఎక్కువ శతక భాగసౌమ్యలు నెలకొల్పిన ఓపెనర్లుగా నిలిచారు. అందుకే అప్పటి నుండి ఇప్పటివరకు వీరు టీం ఇండియాకు ముఖ్యమైన ఓపెనర్లుగా ఉన్నారు. అయితే ఇందులో రోహిత్ శర్మ… విరాట్ కోహ్లీ భారత కెప్టెన్ గా తప్పుకున్న తర్వాత ఆ స్థానంలోకి వచ్చాడు. అయితే రోహిత్ కెప్టెన్ అయిన తర్వాత ధావన్ కు ఎక్కువగా అవకాశాలు రాలేదు.

Advertisement

కానీ ఈ మధ్యే ఇంగ్లాండ్ పర్యటనలో మళ్ళీ వన్డే ఓపెనర్ గా ధావన్ రోహిత్ తో కలిసి ఆడాడు. ఈ పర్యటనకు కేఎల్ రాహుల్ దూరం కావడం వల్ల.. ధావన్ కు స్థానం దక్కింది. కానీ ఈ సిరీస్ లో ఇద్దరు కలిసి ఆడిన ప్రతి మ్యాచ్ లోను అంతగా మాట్లాడుకోలేదు. ఎవరికీ వారే అన్నవిధంగా బ్యాటింగ్ చేసారు. ఇక ధావన్ కూడా తన హిట్టింగ్ కు దూరంగా ఉండు నెమ్మదిగా ఆడాడు. అందువల్ల ధావన్, రోహిత్ మధ్య గొడవలు అనేవి జరుగుతున్నాయి అనే వార్తలు ఎక్కువయ్యాయి. కానీ తాజాగా వీటిపైనా ఓ బీసీసీఐ సెలక్షన్ కమిటీ అధికారి క్లారిటీ ఇచ్చారు.

Advertisement

ఆ సదరు అధికారి మాట్లాడుతూ.. రోహిత్, ధావన్ మధ్య ఎలాంటి గొడవలు లేవు. వారిద్దరి మధ్య భిన్నాభిప్రాయాలు మాత్రమే ఉన్నాయి. ఇవి అందరిలో ఉంటాయి. ఎవరి అభిప్రాయం అనేది వారికీ ఉంటుంది. అయితే ఈ విషయంలో అతనితో జింబాంబ్వే పర్యటన తర్వాత హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ మాట్లాడుతాడు. మా సెలక్టర్లు ఇందులో జోక్యం చేసుకోరు అని తెలిపాడు. అయితే ఇప్పుడు ధావన్ వెస్టిండీస్ లో ఉన్నా భారత వన్డే జట్టుకు కెప్టెన్ గా ఉండగా.. ఇప్పటికే ఈ సిరీస్ ను ఇండియా గెలుచుకుంది. ఇక నామమతమైన మూడో వన్డేలో నేడు విండీస్ తో ఇండియా తలపడబోతుంది.

ఇవి కూడా చదవండి :

మురళి విజయ్ కు బుద్ధి చెప్పిన ఫ్యాన్స్..!

పాకిస్థాన్ ప్రపంచ కప్ గెలవలేదు…!

Visitors Are Also Reading