Home » హైదరాబాద్ లో బీఫ్ పెట్టడం లేదని పాక్ క్రికెటర్ల రచ్చ ?

హైదరాబాద్ లో బీఫ్ పెట్టడం లేదని పాక్ క్రికెటర్ల రచ్చ ?

by Bunty
Ad

వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నమెంట్ మన ఇండియాలో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసింది ఐసీసీ మరియు బీసీసీఐ. అక్టోబర్ 5వ తేదీ నుంచి నవంబర్ 19వ తేదీ వరకు వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నమెంట్ జరగనుంది. ఈ తరుణంలో ఇప్పటికే వరల్డ్ కప్ లో ఆడే జట్లు ఇండియాకు వచ్చాయి. ఇండియాకు రాగానే… ఆయా జట్లకు బీసీసీఐ గ్రాండ్ వెల్కమ్ చెప్పింది.

Advertisement

ఇటు బుధవారం రాత్రి హైదరాబాద్ కు చేరుకుంది పాకిస్తాన్ టీం. ఈ నేపథ్యంలో బాబర్ అజమ్ టీంకు హైదరాబాదులో ఘన స్వాగతం లభించింది. దీంతో పాకిస్తాన్ ప్లేయర్లు కూడా ఫుల్ ఖుషి అయ్యారు. ప్రస్తుతం హైదరాబాదులోని ఓ ప్రముఖ హోటల్లో పాకిస్తాన్ ప్లేయర్లు ఉంటున్నారు. వారికోసం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసింది హైదరాబాద్ పోలీస్ శాఖ. అయితే పాకిస్తాన్ నుంచి వచ్చిన ప్లేయర్లకు హైదరాబాద్ బిర్యానీ, దంకా బిర్యానీ, మటన్, చికెన్, చిల్లి చికెన్, పన్నీరు చికెన్, మటన్ బిర్యానీ, హైదరాబాద్ స్పెషల్ బిర్యాని ఇలా అన్ని రకాల వంటకాలను పాకిస్తాన్ ప్లేయర్లకు పెడుతోంది బీసీసీఐ.

Advertisement

అయితే తమకు బీఫ్ కావాలని పాకిస్తాన్ క్రికెటర్లు బాగా అడుగుతున్నారట. తాము ఎప్పుడూ కూడా బీఫ్ తింటామని… కానీ హైదరాబాదులో అది లభించడం లేదని ఆందోళన చెందుతున్నారట. అయితే బీసీసీఐ నిబంధనల ప్రకారం ఇండియాకు వచ్చిన 9 జట్లకు కూడా బీఫ్ పెట్టకూడదని ఆదేశాలు ఉన్నాయట. అందుకే పాకిస్తాన్ క్రికెటర్లకు కూడా పెట్టడం లేదు. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇవి కూడా చదవండి

Visitors Are Also Reading