ప్రపంచంలోనే అత్యంత సంపన్న వ్యాపారవేత్తల జాబితాలో అగ్రస్థానంలో నిలిచిన ముకేశ్ అంబానీ ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంది. ముకేశ్ అంబానీ, నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ నిశ్చితార్థం గత శుక్రవారం జరిగింది. చిరకాల స్నేహితురాలు రాధిక మర్చంట్ తో అనంత్ కి నిశ్చితార్థం జరిగింది. అంబానీల ఐకానిక్ బిల్డింగ్ ఆంటీలియా నివాసంలో ఈ నిశతార్థం వైభవంగా జరిగింది. కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువుల సమక్షంలో గుజరాతి సాంప్రదాయం ప్రకారం ఉంగరాలు మార్చుకున్నారు.
Advertisement
ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. అయితే ఈ ఫోటోలలో అనంత్ అంబానీ భారీకాయంతో కనిపించారు. గతంలో భారీగా బరువు తగ్గి, నాజూగ్గా మారిన అనంత్ మల్లి బరువు పెరగడం చూసి చాలామంది ఆశ్చర్యపోయారు. దీనిపై సోషల్ మీడియాలో ట్రోల్స్ కూడా వచ్చాయి. అయితే 2016లో 200 కిలోల నుంచి 100 కిలోల వరకు బరువు తగ్గిన అనంత్, మళ్లీ ఎందుకు బరువు పెరిగారన్న విషయంపై అనంత్ తల్లి నీతా అంబానీ స్పందించారు.
Advertisement
“గతంలో 200 కిలోల వరకు బరువు ఉన్న అనంత 100 కిలోల వరకు బరువు తగ్గి చాలామందికి రోల్ మోడల్ గా నిలిచాడు. నా కుమారుడు తీవ్రమైన అస్తమాతో బాధపడ్డాడు. దీనికి చికిత్సలో భాగంగా కొన్ని స్టెరాయిడ్లు తీసుకున్నాడు. వీటి దుష్ప్రభావాల కారణంగానే ఆనంత్ మళ్ళీ బరువు పెరిగాడు. అనంత ప్రతిరోజూ 5 నుంచి 6 గంటల పాటు వ్యాయామం చేస్తాడు. యోగాతో పాటు కార్డియో వ్యాయామాలు ఆచరిస్తాడు. నా కుమారుడిలాగే ఊబకాయంతో పోరాడుతున్న వాళ్లు మన చుట్టూ చాలామంది ఉంటారు. దయచేసి అలాంటి వాటిని చిన్నచూపు చూడకండి” అని వివరించారు నీతా అంబానీ.
READ ALSO : రవితేజతో సినిమాలు చేసి, కెరీర్ నాశనం చేసుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా?