Home » రవితేజతో సినిమాలు చేసి, కెరీర్ నాశనం చేసుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా?

రవితేజతో సినిమాలు చేసి, కెరీర్ నాశనం చేసుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా?

by Bunty

గత కొంతకాలంగా రవితేజ బ్యాక్ టు బ్యాక్ ఫెయిల్యూర్ సినిమాలతో సతమతమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే మాస్ మహారాజా రవితేజ కెరీర్ బెస్ట్ ఓపెనింగ్ సాధించిన సినిమాగా ధమాకా నిలిచింది. రవితేజకు సూపర్ డూపర్ కమర్షియల్ సక్సెస్ అందించింది. వీకెండ్ తర్వాత కూడా బాక్సాఫీస్ బరిలో సినిమా దూకుడు తగ్గలేదు. రవితేజ సరసన శ్రీ లీల కథానాయికగా నటించిన ధమాకా డిసెంబర్ 23న థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా బంపర్ హిట్ కొట్టి ఇప్పుడు ఓటీటీలోను దుమ్ములేపుతోంది.

అయితే రవితేజతో ఎంతోమంది హీరోయిన్లు నటించిన, ఒక్క హీరోయిన్ మాత్రం అన్ లక్కీ హీరోయిన్ గా పేరుపొందింది. ఈ హీరోయిన్ మాత్రం ఎంతో మందికి లక్కీ హీరోయిన్ గా మారిన రవితేజకు ఒక్కటే ఫ్లాప్ లనే ఇచ్చింది. ఆ హీరోయిన్ ఎవరో కాదు ఆమె కాజల్ అగర్వాల్. రవితేజ, కాజల్ అగర్వాల్ కాంబినేషన్ లో వచ్చిన వీర, సారొచ్చారు సినిమాలు పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. ఈ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది.

డైరెక్టర్ రమేష్ వర్మ దర్శకత్వంలో వచ్చిన వీర చిత్రంలో పవర్ఫుల్ పాత్రలో నటించారు రవితేజ. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ రొమాన్స్ ఈ సినిమాకి హైలైట్ గా ఉంటుంది. కానీ ఈ సినిమా మాత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఆ తర్వాత డైరెక్టర్ పరుశురాంతో కలిసి సారొచ్చారు సినిమాలో నటించారు రవితేజ, కాజల్ అగర్వాల్. ఈ చిత్రం కూడా ఫ్లాప్ గానే మిగిలింది. దీంతో రవితేజకు మాత్రమే ఈ హీరోయిన్ అన్ లక్కీగా పేరుపొందింది.

READ ALSO : TS : ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ అభ్యర్థులకు గుడ్‌న్యూస్‌.. వారందరికీ మరోసారి ఈవెంట్స్‌!

Visitors Are Also Reading