Home » మెట్రోలో నిర్మలా సీతారామన్ కి చేదు అనుభవం..!

మెట్రోలో నిర్మలా సీతారామన్ కి చేదు అనుభవం..!

by Sravya
Ad

సెలబ్రిటీలు రాజకీయ నాయకులు చాలా అరుదుగా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ లో ట్రావెల్ చేస్తూ ఉంటారు. అటువంటి సమయంలో జనాలు సెలబ్రిటీ దగ్గరికి వెళ్లి మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటారు ఫొటోస్ కూడా అడుగుతుంటారు. ఎలా అయినా తమ లీడర్ దగ్గరికి వెళ్లి కనీసం మాట్లాడటం లేదంటే ఆటోగ్రాఫ్ షేక్ హ్యాండ్ కోసమైనా కోరుకుంటారు. ఇటువంటివి మనం చాలా రొటీన్ గా చూస్తూ ఉంటాం. ఎన్నికల సమయంలో నాయకులు ప్రజల్లోకి వెళ్లడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు, అప్పటిదాకా వీఐపీ బందోబస్తులో ఉన్న వాళ్ళు కూడా సింపుల్ గా జనాల మధ్యకి వెళ్తుంటారు. ఇవి రెగ్యులర్ గా మనం చూస్తాం.

Advertisement

ఎన్నికల తర్వాత ఏదైనా నాయకుడిని కలవాలంటే మాత్రం అపాయింట్మెంట్ కనీసం వాళ్ళ దగ్గరికి వెళ్లాలంటే గేటు వరకు కూడా రానివ్వడానికి సెక్యూరిటీ పర్మిషన్ ఇవ్వరు. ఇదిలా ఉంటే నిర్మల సీతారామన్ ఢిల్లీ మెట్రోలో ట్రావెల్ చేశారు అక్కడ ఉన్న ప్రయాణికులు ఆమెను అసలు పట్టించుకోలేదు. కనీసం లేచి నిలబడి ఆమెకి సీటు కూడా ఇవ్వలేదు. సోషల్ మీడియాలో ఇది ప్రస్తుతం వైరల్ అవుతోంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ కి చేదు అనుభవం ఢిల్లీలోని మెట్రోలో ఆమె గత శనివారం సీఏ కోచింగ్ లో తరగతులను సందర్శించడానికి వెళ్లారు.

Advertisement

Also read:

Also read:

ఆమె మెట్రోలో సాధారణ ప్రయాణికులుగానే నిలబడ్డారు. ఆ టైంలో మెట్రో అంతా ఫుల్ రద్దీగా ఉంది. చుట్టుపక్కల ఉన్న ప్రయాణికులు వింతగా చూస్తున్నారు. కానీ ఆమెకు మాత్రం ఎవరు సీటు ఇవ్వలేదు. ఒక మహిళ వచ్చి ఆమెని పలకరించారు కనీసం ఏ ఒక్కరు కూడా నిర్మల పట్ల గౌరవంగా ప్రవర్తించలేదు. నిజంగా నిర్మల సీతారామన్ లేదంటే ఎవరైనా
రిలీజ్ చేస్తున్నారా అని అనిపించేలా ఈ సంఘటన జరిగింది. తమ మొబైల్ ఫోన్లలో నిర్మల వీడియోను రికార్డ్ చేసుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా నిలిచింది. కేంద్ర మంత్రికి ఇచ్చే గౌరవం ఇదేనా అని సోషల్ మీడియాలో పలువురు కామెంట్లు చేస్తున్నారు.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

 

Visitors Are Also Reading