పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన కొమురం పులి సినిమాతో టాలీవుడ్‌కి పరిచయం అయింది నిఖిషా పటేల్. 2010లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచింది. దీంతో నిఖీషా పటేల్‌కి తెలుగులో పెద్దగా గుర్తింపు రాలేదు. కొమురం పులి సినిమా తరువాత తెలుగులో కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ అవి కూడా ఆశించిన మేరకు ఆకట్టుకోలేదు. దీంతో ఆమెకు ఆఫర్లు అంతగా రాకపోవడంతో ఆమె తెలుగు పరిశ్రమకి దూరమైంది.
Also Read : అరుంధతిలో జేజమ్మ గా నటించిన ఈ చిన్నారి ఇప్పుడు ఎలా ఉందో చూశారా
Advertisement
కొమురం పులి సినిమాతో గుర్తింపు పొందిన నిఖిషా పటేల్ తమిళ, కన్నడ సినీ పరిశ్రమ నుంచి వరుస ఆఫర్లు వచ్చాయి. అక్కడ కూడా కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ ఏమైందో ఏమో అకస్మాత్తుగా చిత్ర పరిశ్రమకి దూరం అయింది. ప్రస్తుతం నిఖిషా పటేల్ విదేశాల్లో ఉంటుంది. ఎప్పటికప్పుడూ సోషల్ మీడియాలో ఆమె అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటుంది.
Advertisement
Also Read : దర్శకుడు పూరి జగన్నాథ్ కి బయ్యర్స్ బ్లాక్ మెయిల్.. వార్నింగ్ ఇచ్చిన పూరి..!
గతంలో ఆమె సోషల్ మీడియాలో ఓ వార్తను పంచుకుంది. తాను ఓ విదేశీయుడితో ప్రేమలో ఉన్నానని, త్వరలోనే పెళ్లి చేసుకోనున్నట్టు వెల్లడించింది. బాయ్ ఫ్రెండ్ ఎవరని, అతన్ని చూపించాలని పదే పదే సోషల్ మీడియాలో అభిమానులు అడగడంతో తాజాగా ప్రియుడిని చూపించింది నిఖిషా పటేల్. దీపావళి పండుగ సందర్భంగా తన కాబోయే భర్త, బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి దిగిన ఫోటోను పంచుకుంది. అదేవిధంగా అభిమానులకు దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపింది నిఖిషా పటేల్. ప్రస్తుతం నిఖిషా పటేల్ బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి ఉన్న ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Also Read : దేవుడి పై ఒట్టేసి కూడా రేణూ దేశాయ్ అబద్దం చెప్పిందా…? అలా ఎందుకు చేసింది..?