Nikhil Siddhartha: హీరో నిఖిల్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. నిఖిల్ పలు సినిమాలతో మంచి హిట్ లని అందుకున్నారు. చాలా కాలం నుండి టాలీవుడ్ లో హీరోగా కొనసాగిస్తున్నారు. టాలీవుడ్ హీరో నిఖిల్ టీడీపీ లో చేరినట్లు ప్రచారం జరుగుతోంది. నారా లోకేష్ సమక్షంలో నిఖిల్ సిద్ధార్ధ్ పసుపు కండువా ని కప్పుకున్నట్లు తెలుస్తోంది. నిఖిల్ టీడీపీ లో చేరారని వచ్చే ఎన్నికల్లో పార్టీ తరపు నుండి పోటీ చేస్తారని టాక్ కూడా వచ్చింది.
Advertisement
రాజకీయాలు చేయాలని నిఖిల్ టీడీపీ లో చేరలేదని బంధువుకి టికెట్ ఇచ్చినా తెలుగుదేశం పార్టీకి కృతజ్ఞత తెలపడానికి మాత్రమే లోకేష్ ని కలిసారని సన్నిహితులు అయితే చెప్తున్నారు. ఇందులో ఏ మాత్రం రాజకీయం లేదని అంటున్నారు. నిఖిల్ మామ మద్దులూరి మాల కొండయ్య యాదవ్ చీరాల అసెంబ్లీ నియోజకవర్గంలో నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో నిఖిల్ టీడీపీ కి మద్దతు తెలిపినట్లు తెలుస్తోంది. మాలకొండయ్య యాదవ్ సీనియర్ నాయకుడు విద్యా సంస్థలు కూడా ఆయనకి ఉన్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కూడా చేస్తారు. 2009 ఎన్నికల్లో టిడిపి తరఫున ఒంగోలు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. వైసీపీ ఆవిర్భావంతో పార్టీలో చేరారు 2019 ఎన్నికలకు ముందు టిడిపిలోకి తిరిగి జాయిన్ అయిపోయారు.
Advertisement
Also read:
- Yamadonga: యమదొంగ లో రాజమౌళి వద్దన్న కూడా.. విజయేంద్రప్రసాద్ ఆ సీన్ ఎందుకు పెట్టారు..?
- ముఖేష్ అంబానీ కుటుంబీకులు.. చేతులకు నల్ల దారం ఎందుకు కట్టుకుంటారు..?
- చిరంజీవి పెద్ద కూతురు భర్త ఎంత కోటీశ్వరుడంటే.. కానీ ఆయన గురించి అసలు నిజాలు..!!
2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన కారణం బలరాం పార్టీ నుండి ఫిరాయించిన విషయం మనకి తెలిసిందే. చీరాల ఇన్చార్జిగా మాలకొండయ్యకి టిడిపి అధిష్టానం బాధ్యతల్ని అప్పగించింది చీరాల లో యాదవ సామాజిక వర్గం ఎక్కువగా ఉంటుంది. అందుకనే 2024 ఎన్నికల్లో మాలకొండయ్య అభ్యర్థిని టిడిపి హైకమాండ్ ఫిక్స్ చేసింది ఇక్కడ వైసిపి అభ్యర్థి కరణం బలరాం కొడుకు వెంకటేష్ ని నియమించింది. వైసీపీ హీరో నిఖిల్ సోదరిని మాల కొండయ్య యాదవ్ పెద్ద కొడుకు అమర్నాథ్ కి ఇచ్చి పెళ్లి చేశారు వీళ్ళ బంధుత్వం అప్పటినుండి కూడా ఉంది నిఖిల్ ఏకంగా టిడిపి కండువని కప్పుకున్నారు వచ్చే ఎన్నికల్లో టిడిపి తరఫున ప్రచారం చేస్తారని కూడా టాక్.
తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!