మన టాలీవుడ్ లో మెగా స్టార్ అంటే అది ఒక్క బ్రాండ్. ఆ తర్వాత అది మెగా ఫ్యామిలీగా అయిపోయింది. ఈ ఫ్యామిలీ నుండి చాల మంది హీరోలు మన టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. వారికీ మంచి గుర్తింపు వచ్చింది. అయితే ఈ మెగా అంటూ ఏ హీరో వచ్చిన వారికీ చాల త్వరగా స్టార్ డమ్ వచ్చేస్తుంది. మెగాస్టార్ చిరంజీవికి ఇద్దరు కూతుర్లు, ఒక్క కొడుకు ఉన్నారు. కానీ ఆయనను ఆయన తమ్ముడి నాగబాబు కొడుకు వరుణ్ తేజ్, కూతురు నిహారిక కూడా డాడీ అని పిలుస్తుంటారు.
Advertisement
మాములుగా ఎవరైనా ఎవరినన్నా అమ్మ అని పిలుస్తారు. కానీ డాడీ అని పిలువారు. అయితే తాము అలా పెద్దనాన్న అయ్యే చిరంజీవిని డాడీ అని ఎందుకు పిలుస్తున్నం అనే విషయాన్ని తాజాగా నిహారిక వెల్లడించింది. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ లో.. మీరు చిరంజీవిగారిని డాడీ అని ఎందుకు పిలుస్తారు అనే ప్రశ్న ఎదురుకాగా.. నిహారిక సమాధానం ఇస్తూ.. మా అన్న వరుణ్ తేజ్ చిన్నప్పుడు ఎక్కువగా పెద్దనాన్న వాళ్ళ ఇంట్లోనే పెరిగాడు. ఎక్కువగా చరణ్ అన్నయతోనే ఉండేవాడు. అప్పుడు అక్కడ చరణ్ అన్నయ చిరంజీవిగారిని డాడీ డాడీ అని పిలుస్తుండటం చూసి మా అన్నయకు అలవాటు అయ్యింది.
Advertisement
ఆ తర్వాత నుండి వరుణ్ అలాగే పిలుస్తూ ఉండేవాడు. అలా తనను చూసి నాకు పైన డాడీ డాడీ అంటూ అలవాటు అయింది అని నిహారిక తెలిపింది. అలాగే తన సినిమా, సిరీస్ ల ఓపెనింగ్ కు చిరంజీవిగారిని ఎందుకు పిలవరు అనగా.. ఆయన చాల బిజీగా ఉంటారు. నేనే పిలిస్తే వస్తారు. కానీ నేను ఆయనకు స్ట్రగుల్ ఇవ్వాలని అనుకోను. అందుకే ఆయనను నేను పిలవను అంటూ పేర్కొంది నిహారిక.
ఇవి కూడా చదవండి :