మెగాడాటర్ నిహారిక పేరుఈ మధ్య సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. నిహారిక అర్ధరాత్రి దాటిన తరవాత పబ్ లో ఉండటంతో ఆమెతో పాటూ మరికొందరు సెలబ్రెటీలను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. నిహారిక వెళ్లిన పబ్ లో డ్రగ్స్ ఆనవాళ్లను పోలీసులు గుర్తించడంతో ఈ వార్త సెన్సేషనల్ అయ్యింది. ఆ తరవాత పబ్ నిర్వాహకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక ఈ కేసును మెల్లిమెల్లిగా అంతా మర్చిపోయారు.
అయితే నిహారిక పై మాత్రం సోషల్ మీడియాలో ట్రోల్స్ ఎక్కువగా వచ్చాయి. దాంతో నాగబాబు రంగంలోకి దిగి తప్పుడు ప్రచారం చేయవద్దంటూ కోరారు. ఇక తాజాగా నిహారిక తన తల్లితో కలిసి మదర్స్ డే సంధర్బంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సంధర్బంగా పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది.
Advertisement
Advertisement
నిహారిక పబ్ ఇష్యూ పై కూడా నిహారిక తల్లి పద్మజ స్పందించింది. మొదట్లో ఇలాంటి రావడం ఇబ్బందిగా అనిపించేదని కానీ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు తప్పదని పద్మజ చెప్పుకొచ్చారు. తప్పు చేయనంత వరకూ ఎవరికీ భయపడనవసరం లేదని పద్మజ వ్యాఖ్యానించింది. నా కూతురేంటో నాకు తెలుసు అంటూ కామెంట్ చేసింది. అంతే కాకుండా మా బావగారు ఉన్నారు….ఆయన ఉన్నంత వరకూ మాకేం పర్వాలేదంటూ పద్మజ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
ఇదిలా ఉండగా నిహారిక అప్పట్లో సోషల్ మీడియాకు దూరమైన సంగతి తెలిసిందే. దాంతో నిహారిక అకౌంట్ ను హాక్ చేశారా అన్న అనుమానాలు కూడా మొదలయ్యాయి. ఇక రీసెంట్ గా నిహారిక సోషల్ మీడియాలో కూడా మళ్లీ యాక్టివ్ అయ్యారు. సినిమాల విషయానికి వస్తే నిహారిక కొన్ని వెబ్ సిరీస్ లకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కానీ నటనకు మాత్రం కొంత కాలంగా దూరంగా ఉంటున్నారు.
Also read :
తెలుగులో 24గంటల్లోనే అత్యధిక వ్యూవ్స్ సంపాదించిన టాప్ 5 లిరికల్ వీడియోలు..!
తిరుపతి భహిరంగ సభలో ఎన్టీఆర్ పై కృష్ణ చేసిన ఘాటు విమర్శలు…ఆ తరవాత వైఎస్ఆర్ ఎమన్నారంటే…!