Telugu News » ఆ లవ్ ఫెయిల్యూర్ హీరోతో నిధి ప్రేమాయణం…త్వరలోనే పెళ్లి…?

ఆ లవ్ ఫెయిల్యూర్ హీరోతో నిధి ప్రేమాయణం…త్వరలోనే పెళ్లి…?

by AJAY MADDIBOINA

ఇండస్ట్రీలో హీరోయిన్లు హీరోలతో ప్రేమలో పడటం సర్వసాధారణ విషయం. ఎంతో మంది అమ్మాయిలు అభిమానించే హీరోలతో ప్రేమ, పెళ్లి అంటే హీరోయిన్లు మాత్రం కాదంటారా..? అయితే కొన్నిసార్లు వారి ప్రేమ పెళ్లి ఫలించగా… మరి కొన్ని సార్లు మాత్రం ఇబ్బందులు తప్పవు. అయితే ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్న టాలీవుడ్ హీరోయిన్ నిధి అగర్వాల్ ప్రేమలో పడినట్టు ఫిలిం నగర్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. నిధి అగర్వాల్ తమిళ హీరో శింబుతో ప్రేమలో పడిందని… త్వరలోనే ఈ జంట పెళ్లి కూడా చేసుకోబోతున్నారని కోలీవుడ్ మీడియా కోడై కూస్తోంది.

Ads
Nidhi Agarwal

Nidhi Agarwal

శింబు నిధి అగర్వాల్ కలిసి ఈశ్వరన్ అనే సినిమాలో నటించారు. ఈ సినిమాకు సుశీంద్రన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా గత సంవత్సరం జనవరిలో విడుదల అయింది. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలోనే నిధి అగర్వాల్ ప్రేమలో పడినట్లు వార్తలు వస్తున్నాయి. కరోనా లాక్ డౌన్ సమయంలో చెన్నైలో శింబు ఇంట్లోనే ఇద్దరూ కలిసి ఉన్నారంటూ కూడా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అంతేకాకుండా త్వరలోనే వీరిద్దరూ పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోబోతున్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే ఎవరో ఒకరు నోరు విప్పాల్సిందే. ఇదిలా ఉండగా నిధి అగర్వాల్ హిందీ సినిమాతో మొదట చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత నాగచైతన్య హీరోగా నటించిన సవ్యసాచి సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. కానీ నిధి అగర్వాల్ కు రామ్ హీరోగా నటించిన ఇస్మార్ట్ శంకర్ తో గుర్తింపు వచ్చింది.

ఈ సినిమా తర్వాత నిధి అగర్వాల్ ఇస్మార్ట్ బ్యూటీగా పేరు తెచ్చుకుంది. ఇక ప్రస్తుతం నిధి అగర్వాల్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న “హరి హర వీరమల్లు” సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇక శింబు విషయానికి వస్తే మానాడు సినిమాతో సక్సెస్ ట్రాక్ అందుకున్నాడు. ఇదిలా ఉండగా శింబూ ఇది వరకు పలువురు హీరోయిన్లతో ప్రేమాయణం నడిపిన సంగతి తెలిసిందే. త్రిష, నయనతార లాంటి హీరోయిన్లతో ప్రేమాయణం నడిపి ఇప్పుడు సింగిల్ గానే ఉన్నాడు. మరి నిధి అగర్వాల్ తో ప్రేమ వ్యవహారం ఎంత దూరం వెళుతుందో చూడాలి.


You may also like