పాకిస్తాన్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్ వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. దీంతో 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను.. ఇంకో మ్యాచ్ మిగిలి ఉండగానే కైవసం చేసుకుంది. క్రైస్ట్ చర్చిలో జరిగిన ఈ నాలుగో మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచి కివీస్ బౌలింగ్ ఎంచుకుంది. ప్రత్యర్ధి పాకిస్తాన్ బ్యాటింగ్‌కు దిగగా.. ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ అయూబ్ ఒక్క పరుగుకే పెవిలియన్ చేరాడు. అయితే మరో ఓపెనర్ రిజ్వాన్(90) అద్భుతమైన ఇన్నింగ్స్ తో జట్టును ఆదుకున్నాడు. ఒక ఎండ్‌లో వికెట్లు వరుసగా పడుతున్నా.. మరో ఎండ్ నుంచి రిజ్వాన్ పరుగుల వరద పారించాడు.
Advertisement
చివరిలో నవాజ్ 9 బంతుల్లో 3 సిక్సర్లతో 21 పరుగులు చేయడంతో.. పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లకు 5 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేయగలిగింది. రెండో ఇన్నింగ్స్‌లో 159 పరుగుల లక్ష్యచేధనలో భాగంగా బరిలోకి దిగిన న్యూజిలాండ్ జట్టుకు.. పాక్ కెప్టెన్ షాహీన్ అఫ్రిది ఆరంభంలో గట్టి షాక్ ఇచ్చాడు. ఫలితంగా 20 పరుగులకే మొదటి 3 వికెట్లు కోల్పోయింది న్యూజిలాండ్. అయితేనేం ఆ తర్వాత వచ్చిన మిచెల్(72), ఫిలిప్స్(70) నాలుగో వికెట్‌కు 130 పరుగులకు పైగా భాగస్వామ్యాన్ని నెలకొల్పడమే కాకుండా.. అదిరిపోయే అర్ధసెంచరీలతో గ్రౌండ్ దద్దరిల్లేలా చేశారు.
Advertisement
44 బంతులు ఎదుర్కున్న మిచెల్.. 7 ఫోర్లు 2 సిక్సర్లతో 72 పరుగులు.. 52 బంతులు ఎదుర్కున్న ఫిలిప్స్ 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 70 పరుగులు చేశారు. ఇక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు మిచెల్‌ను వరించింది. ఇక రెండు జట్ల మధ్య చివరి టీ20 ఆదివారం హగ్లేయ్ ఓవల్ స్టేడియంలో జరుగనుంది. గతంలోనూ ఫిలిప్స్, మిచెల్.. టీమిండియాతో జరిగిన మ్యాచ్‌ల్లో మెరుపులు మెరిపించారు. మలుపుతిప్పే ఇన్నింగ్స్‌లతో టీమిండియా చేతుల్లో నుంచి విజయాన్ని దాదాపుగా లాగేసేలా చూశారు. కానీ చివరికి భారత్ విజయం సాధించింది.
స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!